Begin typing your search above and press return to search.

భార‌త్ మాతాకీ జై.. అల్లాకి అతీతం!

By:  Tupaki Desk   |   12 April 2016 10:00 AM GMT
భార‌త్ మాతాకీ జై.. అల్లాకి అతీతం!
X
దేశ‌వ్యాప్తంగా పెను చ‌ర్చ‌కు దారి తీసిన భార‌త్ మాతా కీ జై నినాదంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య ఒక‌టి తెర‌పైకి వ‌చ్చింది. ఈ నినాదాన్ని ప‌లికే విష‌యంలో మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌తో మొద‌లైన ర‌చ్చ రోజురోజుకీ మ‌రింత పెర‌గ‌ట‌మే త‌ప్పించి త‌గ్గింది లేదు. కొంద‌రు ఈ నినాదాన్ని ప‌ల‌కాల్సిందేన‌ని చెప్ప‌టం.. దానికి భిన్నంగా మ‌రికొంద‌రు ఈ నినాదానికి మ‌తంతో ముడిపెట్ట‌టం తెలిసిందే. రోజులు గ‌డిచే కొద్దీ ఈనినాదం ఓ పెద్ద చ‌ర్చ‌కు తెర తీయ‌ట‌మే కాదు.. ప‌లువురినేత‌ల పుణ్య‌మా అని ఇదో వివాదాస్ప‌ద అంశంగా మారిపోయింది.

ఈ నినాదాన్ని ప‌ల‌క‌ని వారిని దేశం నుంచి బ‌య‌ట‌కు పంపాల‌ని కొంద‌రంటే.. చ‌ట్టం మీద గౌర‌వంతో ఆగాను కానీ లేకుంటే ప‌ది ల‌క్ష‌ల మంది గొంతులైనా కోయ‌టానికి వెనుకాడేది లేదన్న విప‌రీత వ్యాఖ్య‌లు కూడా వ‌చ్చాయి.

ఇదిలాఉంటే.. ఈ నినాదం చేయొద్దంటూ మైనార్టీల‌కు చెందిన కొంత‌మంది ఫ‌త్వా జారీ చేయ‌టం ఈ వివాదం మ‌రింత ముదిరేలా చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ న‌జీబ్ జంగ్ ఈ నినాదంపై స్పందించారు. భార‌త్ మాతాకీ జై అనే నినాదాన్ని ప‌ల‌క‌టానికి తాను గ‌ర్వ‌ప‌డ‌తాన‌ని తేల్చారు. అయితే.. నినాదాల్ని ప‌ల‌కాలంటూ ఎవ‌రిని బ‌ల‌వంత‌పెట్ట‌కూడ‌దన్న ఆయ‌న‌.. ఎవ‌రైనా త‌మ‌కు ఇష్టం లేని నినాదాల్ని ప‌లికేందుకు ఇష్ట‌ప‌డ‌కుంటే.. వారిని జాతి వ్య‌తిరేకులుగా చూడకూడ‌ద‌ని వ్యాఖ్యానించారు.

భార‌త మాతాకీ జై నినాదం దేవుడికి.. అల్లాకు అతీత‌మైన‌ద‌న్న జంగ్.. మాతృభూమిని ప్రేమించ‌టం దేశంలోని ప్ర‌తి పౌరుడికి గ‌ర్వ‌కార‌ణ‌మైన అంశ‌మ‌ని చెప్పారు. బార‌త‌మాతాకీ జై నినాదాన్ని ప‌ల‌క‌టానికి తాను గ‌ర్వ‌ప‌డ‌తాన‌ని చెప్పుకొచ్చారు. మ‌రి.. జంగ్ వ్యాఖ్య‌ల‌కు స్పంద‌న ఎలా ఉంటుందో..?