Begin typing your search above and press return to search.

పవన్ కోసం చిరు జెండా పట్టుకుంటారా...?

By:  Tupaki Desk   |   22 Nov 2022 8:33 AM GMT
పవన్ కోసం చిరు జెండా పట్టుకుంటారా...?
X
జనసేన వచ్చే ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది అని అంతా అంటున్నారు. ఏపీలో కొత్త పార్టీగా ఇప్పటిదాకా జనాలు ఎన్నుకోని పార్టీగా జనసేనకు ఆ ఫ్లావర్ అయితే కచ్చితంగా ఉంది. అందుకే ఒక్క చాన్స్ అంటూ పవన్ జనలా వద్దకు వెళ్ళి కోరుతున్నారు. ఒక్క చాన్స్ అని అడిగే హక్కు ఏపీలో ఇపుడున్న రాజకీయ పార్టీలలో ఆయనకు మాత్రమే ఉంది.

ఎందుకంటే ఆయన పాలన ఏంటో జనాలకు ఈ రోజుకూ తెలియదు కాబట్టి ఆకాశమే హద్దుగా పవన్ జనాలను తన వైపునకు తిప్పుకునేలా అంచనాలు ఎన్ని అయినా పెంచేయవచ్చు. సరే పవన్ మార్క్ ప్లాన్స్ ఉంటాయి. ఆయన రాజకీయం ఆయన చేసుకుంటారు. వ్యూహాలు కూడా సిద్ధంగా ఉంటాయి.

ముందే చెప్పుకున్నట్లుగా ఇది భీకరమైన రాజకీయ సమరం. అందువల్ల బలం ఎంత కావాలి అంటే ఎంతైనా అని చెప్పుకోవాలి. ఎంత బలమున్న ప్రత్యర్ధుల ఎత్తులు జిత్తుల నుంచి ఎదుర్కొనేందుకు సరిపోతుందా అన్న చర్చ ఉంది. అందుకే మెగాస్టార్ కి సొంత ఫ్యామిలీ నుంచి కూడా అతి పెద్ద మద్దతు ఈ ఎన్నికల్లో అవసరం అని అంటున్నారు

నిజానికి ఏపీలో పవన్ తో తమ దోస్తీ అంటోంది బీజేపీ. అయితే బీజేపీకి ఏపీలో బలం ఏమీ లేదు. పవన్ ఫేస్ వాల్యూతో ఆయన గ్లామర్ తో తమ రాజకీయ పంట పండించుకోవాలన్న తాపత్రయం ఆ పార్టీది. ఇంకో వైపు అపర చాణక్యంలో ఆరితేరిపోయిన తెలుగుదేశం పార్టీకి కూడా పవన్ కావాలి. పవన్ ఉంటే వైసీపీకి ధీటుగా ఎదురు నిలిచి చెక్ పెట్టవచ్చు అన్నది టీడీపీ మాస్టర్ స్ట్రాటజీ.

ఈ విధంగా చెప్పుకుంటే ఆ రెండు పార్టీలు పవన్ కోసం కాకుండా తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తూ వస్తాయని వేరేగా చెప్పాల్సినది లేదు. ఇందులో వింతా విశేషమూ లేదు. ఏ రాజకీయ పార్టీకి దాని అవసరాలూ అజెండా ఉంటాయి. మరి ఆ రెండు పార్టీలను కలుపుకుని పోయినా పవన్ రాజకీయ లక్ష్యం నెరవేరుతుందా అంటే కాదు అనే చెప్పాలి.

ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్నది పవన్ టార్గెట్. మరి ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నపుడు మరింత మద్దతు కుటుంబం నుంచే రావాలి అన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికైతే మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు ఒక్కరే పవన్ పక్కన కనిపిస్తున్నారు. ఆయన పార్టీలో కీలకం అయి తిరుగుతున్నారు. మరి మెగాస్టార్ మాత్రం దీవెనలు అందిస్తున్నారు. పవన్ కి ఉన్నత స్థానం దక్కాలని ఆశిస్తున్నారు.

అంతవరకూ బాగానే ఉన్నా ఉన్నతస్థానం దక్కాలీ అంటే అవి ఆశలతో ఆశీస్సులతో కుదిరే పనేనా అన్న చర్చ అయితే వస్తోంది. మెగా ఫ్యామిలీ కూడా తలా ఒక చేయి వేస్తేనే పవన్ కళ్యాణ్ అనుకున్న టార్గెట్ ని రీచ్ అవుతారు అని అంటున్నారు. ఇప్పటికైతే మెగా ఫ్యామిలీలో అందరు హీరోలూ ఎవరి బిజీలో వారు ఉన్నారు. వారు సినిమాలకే మొదటి ప్రయారిటీ ఇస్తున్నారు.

మరి వచ్చే ఎన్నికల్లో పవన్ పక్షాన నిలబడి ప్రచారం చేయడానికైనా సలహాలు ఇచ్చి ఆయన్ని ముందుకు తీసుకెళ్లడానికైనా మెగా ఫ్యామిలీలో కీలకమైన వ్యక్తులు బయటకు వచ్చి మాట్లాడుతారా అన్న చర్చ ఉంది. అందరికంటే ముందు మూలవిరాట్టు మెగాస్టార్ తమ్ముడు కోసం జనసేన జెండా పట్టుకుని ప్రచారం చేస్తారా అన్న ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. మరి అదే కనుక జరిగితే పవన్ కళ్యాణ్ కి ఇక తిరుగు ఉండదు అని అంటున్నారు. మరి అది జరిగేనా అంటే ఏమో ఎన్నికలకు ఇంకా టైం చాలా ఉంది కాబట్టి వెయిట్ అండ్ సీ.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.