Begin typing your search above and press return to search.
సీఎం జగన్ ఆస్పత్రుల విషయంలో ఆ నిర్ణయం తీసుకుంటారా ?
By: Tupaki Desk | 18 May 2021 11:30 AM GMTప్రైవేట్ హాస్పిటల్స్..ప్రస్తుతం కరోనా కాలంలో కూడా ప్రజల రక్తం పీల్చేస్తున్నాయి. కరోనా లాంటి మహమ్మారి విజృంభిస్తోన్న ఈ సమయంలో మానవత్వం చూపించాల్సింది పోయి కాసుల కోసం కక్కుర్తి పడుతూ అసలు మందే లేని రోగం పేరు చెప్పి లక్షలకి లక్షలు బిల్లులు వేసి గుంజుతున్నారు. ఈ సెకండ్ వేవ్ లో దేశంలో అతి పెద్ద సమస్య ఆక్సిజన్ కొరత .. ఇలాంటి సమయంలో కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ తమ వక్రబుద్ధి చూపిస్తూ , ఆక్సిజన్ కృత్రిమ కొరత చూపిస్తూ వేలకి వేలు దోచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులన్నింటినీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. దీనివల్ల కరోనా వైరస్ చికిత్సలు, రోగుల వివరాలు, ఫీజుల వసూళ్ళు తదితరాలపై పారదర్శకత వస్తుందని ప్రభుత్వానికి హైకోర్టు చెప్పింది.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం ఏదైనా తీసుకోబోతున్నారా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. హైకోర్టు ఆదేశాల్ని పరిగణలోకి తీసుకుంటే అతి త్వరలోనే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే ఇలాంటి ఉత్తర్వులు, గోవా, మహారాష్ట్ర ప్రభుత్వాలు జారీచేశాయి. కరోనా చికిత్సల విషయంలో రోగులను ప్రైవేటు ఆసుపత్రులు దోపిడి చేస్తున్నాయనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ఎన్ని ప్రైవేటు ఆసుపత్రులు కరోనా చికిత్సను అందిస్తున్నాయో కూడా ప్రభుత్వం దగ్గర సరైన లెక్కలు లేవు. దీనికి ప్రధాన కారణం కరోనా వైరస్ రోగులకు చికిత్సల విషయంలో ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకోకుండానే చికిత్స అందిస్తున్నారు. ఏదైనా జరిగిన తర్వాత , ఆ హాస్పిటల్ పై అనుమానంతోనో , ఆ హాస్పిటల్ పై ఆరోపణలు వచ్చినపుడు విజిలెన్సు అధికారులు దాడులు చేసినపుడు అసలు గుట్టు బయటపడుతోంది. అయితే , తాజాగా హైకోర్టు సూచనలతో ఇలాంటి అనేక సమస్యలకు చెక్ పడినట్లే. ప్రైవేటు ఆసుపత్రులన్నింటినీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకువస్తే చేరుతున్న రోగులు, చికిత్సలు చేయించుకుంటున్న రోగులు, డిస్చార్జవుతున్న రోగులు, ఆక్సిజన్ అవసరాలు, వసూలు చేస్తున్న ఫీజులు స్ట్రీమ్ లైనవుతుంది. మొత్తంమీద ప్రైవేటు ఆసుపత్రుల చికిత్స, వసూలు చేస్తున్న ఫీజుల విషయంలో జనాల్లో చాలా గొడవలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. హైకోర్టు ఆదేశాల్ని అమల్లోకి తీసుకువస్తే కరోనా బాధితుల సమస్యలు దాదాపుగా పరిస్కారం అయినట్టే.