Begin typing your search above and press return to search.
కర్ణాటక.. కాంగ్రెస్-జేడీఎస్ చెరో దారిలో?
By: Tupaki Desk | 2 Aug 2019 2:30 PM GMTకర్ణాటకలో పాత ప్రభుత్వం పడిపోయింది, కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం బలనిరూపణ కూడా చేసేసుకుంది. రాజకీయ రచ్చ మధ్యనే కాంగ్రెస్-జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేశ్ కుమార్ వేటు వేసేయడంతో యడియూరప్ప ప్రభుత్వం గట్టెక్కింది. రెబెల్స్ పై వేటు పడటం అలా బీజేపీకి కలిసి వచ్చింది.
అయితే అంత వరకూ బాగానే ఉంది కానీ, అనర్హత వేటు నేపథ్యంలో ఉప ఎన్నికలు తప్పని సరి అయ్యాయి. రెబల్స్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలన్నింటిలోనూ ఉప ఎన్నికలు తప్పవు. అవన్నీ కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సీట్లు.
ఈ నేపథ్యంలో ఆ పార్టీలు ఉప ఎన్నికల్లో గెలిచి యడియూరప్ప ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టాలని భావిస్తూ ఉన్నాయి. అయితే అధికారం బీజేపీ చేతికి వెళ్లింది. ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న వారిని ఓడించడం అంత తేలిక కాదు.
ఆ సంగతలా ఉంటే.. ఆ ఉప ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం పై జేడీఎస్, కాంగ్రెస్ లు తర్జనభర్జనలు పడుతూ ఉన్నాయట. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ పొత్తు వికటించింది. ఆ రెండు పార్టీలూ కలిసి సీట్లను పంచుకుని పోటీ చేయగా బీజేపీ స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో బై పోల్ లో కలిసి పోటీ చేస్తే అది తిరిగి బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతుందేమో అని కాంగ్రెస్-జేడీఎస్ నేతలు ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది. అందుకే వేర్వేరుగా పోటీ చేసే ఆలోచనలతో ఉన్నారట ఆ పార్టీల నేతలు.