Begin typing your search above and press return to search.
షాకింగ్ న్యూస్: వృషణాల్లో కరోనా వైరస్ తిష్ట
By: Tupaki Desk | 21 April 2020 4:00 AM GMTకరోనా వైరస్ పై రోజుకొక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వైరస్‌పై చేస్తున్న అధ్యయనాలు సరికొత్త విషయాలను వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ మహిళల కంటే పురుషులకే అత్యధికంగా వ్యాపిస్తుందని తేలింది. ఇదే క్రమంలో పురుషులకు సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. పురుషుల్లో వృద్ధుల కంటే యువకులకు కరోనా వైరస్ వ్యాపించే అవకాశం అధికంగా ఉందని తాజాగా ఓ పరిశోధన చెబుతోంది. కరోనా వైరస్ వల్ల అత్యధిక ముప్పు పురుషులకే సోకడానికి కారణమేమిటంటే పురుషులలో ఉండే వృషణాలేనని తేలింది.
ఈ విషయాన్ని యూకేకు చెందిన ‘మెట్రో’ వార్తా సంస్థ వెల్లడించింది. దీని అధ్యయనం ప్రకారం వృషణాల వల్ల పురుషులు కరోనా వైరస్ నుంచి వేగంగా కోలుకోవడం లేదని తేలింది. కరోనా వైరస్ పురుషుల శరీరంలో ఉండే ఊపిరితిత్తులు, పేగులు, గుండెతోపాటు వృషణాల్లో కూడా ఆ వైరస్ తిష్ట వేస్తుందని వెల్లడైంది. ఆయా అవయవాల్లో ఉండే ACE2 ప్రోటీన్లతో బంధాన్ని ఏర్పరుచుకుని ఆ వైరస్ అక్కడే ఉండిపోతుంది. ఈ ప్రోటీన్లు వృషణాల్లోని అండాశయ కణజాలంలో చాలా తక్కువగా ఉండడంతో వైరస్ అక్కడి నుంచి కదలదని ఆ అధ్యయనంలో తేలిందని పేర్కొన్నారు. ఈ కారణంగా కరోనా వైరస్ వచ్చిన పురుషులు కోలుకోవడానికి అధిక సమయం పడుతుందని ఆ కథనంలో వెల్లడించింది.
న్యూయార్క్, ముంబయి నుంచి కరోనా వైరస్‌కు గురైన 48 పురుషులు, 20 మంది మహిళలను పరిశీలించారంట. మహిళలు కేవలం 4 రోజుల్లోనే వైరస్ నుంచి కోలుకోగా.. పురుషులు కోలుకోవడానికి ఆరు రోజుల కంటే ఎక్కువ సమయం పడుతోందని గుర్తించారు. పురుషుల కంటే స్త్రీలలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుందని ఈ కారణంతో వారు త్వరగా కోలుకుంటారని పరిశోధకులు చెబుతున్నారు. స్త్రీలలో XX క్రోమోజోములు ఉంటే, పురుషుల్లో XY క్రోమోజోములు ఉండడంతో పురుషులు కొంత రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండగా, మహిళలకు అధికంగా ఉంటుందని ఆ పరిశోధనలో తేలింది.
అయితే ఈ పరిశోధనలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ సోకిన పురుషులకు సంతాన సమస్యలు కూడా ఎదురవుతాయని ఆ కథనం వెల్లడించింది. వీర్యంపై చెడు ప్రభావం చూపి స్పెర్మ్ కౌంట్ తగ్గి సంతాన సమస్యలు ఎదుర్కొంటారనే తేలింది. దీంతో పురుషులు అప్రమత్తంగా ఉండాలని ఆ కథనంలో సూచించారు. కరోనా వైరస్‌పై పురుషులపై ఈ విధంగా అధిక ప్రభావం చూపుతోంది.