Begin typing your search above and press return to search.
కృష్ణ పదార్థం రహస్యాన్ని ఛేదించబోతున్నారా?
By: Tupaki Desk | 5 July 2022 2:30 PM GMTఈ ఖగోళంలో మానవులకు అంతుచిక్కని ఎన్నో విషయాలున్నాయి. కానీ మనిషి తన మెదడులోకి ఓ సందేహం వస్తే దాని అంతు చూసేదాక వదలడు. అలా పరిశోధకుల మెదడులో మొలకెత్తిన అనుమానాల్లో కృష్ణ పదార్థం ఒకటి.
అసలు ఈ కృష్ణ పదార్థం అంటే ఏంటి? ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలా మంది శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. కానీ ఎవరూ సఫలం కాలేదు. మరోసారి దీని సంగతేంటో చూద్దామనుకుంటోంది లార్జ్ హాడ్రన్ కొలైడర్.
విశ్వంలో అతిపెద్ద అత్యంత ముఖ్యమైన రహస్యాల్లో ఒకటి డార్క్ మ్యాటర్.. అదేనండి కృష్ణ పదార్థం. దీని వెనుక గల రహస్యాలను తెలుసుకోవడానికి లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్(ఎల్ హెచ్ సీ) జులై 5 నుంచి పూర్తి స్థాయిలో పని చేయబోతోంది. విశ్వంలో నాలుగింట మూడు వంతుల ఆవరించి ఉండేది కృష్ణ పదార్థమే. అయితే, ఇది ఏమిటో, ఎలా ఉంటుందో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు.
ఈ రహస్యాల గుట్టును కనుక్కొనేలా స్విట్జర్లాండ్‌లోని సెర్న్‌లో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పార్టికల్ యాక్సిలెరేటర్‌లను ప్రస్తుతం అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో శాస్త్రవేత్తలు సక్సెస్ అయితే ఎల్ హెచ్ సీ కనుగొన్న రెండో సంచలన అంశం డార్క్ మ్యాటర్ అవుతుంది. ఇప్పటికే ''హిగ్స్ బోసన్'' పార్టికల్‌ను ఎల్‌హెచ్‌సీ కనిపెట్టింది. 21 శతాబ్దంలో శాస్త్రవేత్తలు ఛేదించిన కీలకమైన రహస్యాల్లో ఇది కూడా ఒకటి.
''మన విశ్వంలో 80 నుంచి 85 శాతం ఆవరించి ఉండేది ఈ కృష్ణ పదార్థమే. ఇది కాంతి తో ఎలాంటి చర్యలూ జరపదు. దీంతో ఇది మన కంటికి కనపడదు. అందుకే దీన్ని కృష్ణ పదార్థమని పిలుస్తారు. ఇక్కడ అన్నింటికంటే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, అసలు ఇదేమిటో ఇప్పటివరకు మనకు తెలియదు''అని ఎల్ హెచ్ సీ ప్రధాన శాస్త్రవేత్త క్లారా నెల్లిస్ట్ చెప్పారు.
ఇలాంటి పదార్థముందని పరోక్షంగా నిరూపించే ఆధారాలు మాత్రం ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు దొరికాయి. నేరుగా దీని జాడను రుజువు చేసే ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు