Begin typing your search above and press return to search.

నెలరోజుల్లో ఎలన్ మస్క్ టాప్-3కి పడిపోతున్నాడా?

By:  Tupaki Desk   |   23 Nov 2022 8:30 AM GMT
నెలరోజుల్లో ఎలన్ మస్క్ టాప్-3కి పడిపోతున్నాడా?
X
ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్. ఈ టెస్లా అధినేత అపార సంపద పోగేసి ఈ స్తానానికి చేరుకున్నారు. ఎంతో కష్టపడి అసాధ్యాలు సుసాధ్యం చేసి ఈ ఘనత సాధించాడు. అయితే ట్విటర్ ను కొన్నాక ఎలన్ మస్క్ సంపద ఆవిరవుతోంది. ఆయన చర్యలతో టెస్లా, స్పేస్ ఎక్స్ షేర్లు పతనం అవుతున్నాయి.

చేసిన అప్పులు కూడా భారంగా మారి ఈ ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్ పాలిట శాపంగా మారుతున్నాయి. ట్విటర్ తోనే ఈ కుబేరుడి నంబర్ 1 స్థానం గల్లంతు కావడం ఖాయం అంటున్నారు. కొత్తగా కొన్న ట్విటర్ సమస్యలు మస్క్ ను వేధిస్తున్నాయి.

ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన వారి జాబితాలో ఇప్పటికీ మస్క్ దే అగ్రస్థానం. రెండేళ్లుగా ఆయన విద్యుత్ కార్ల సంస్థ టెస్లా షేరు విలువ తగ్గిపోతూ వస్తోంది. ఫలితంగా ఈ ఏడాదిలోనే ఇప్పటివరకూ మస్క్ సంపద విలువ 101 బిలియన్ డాలర్ల మేర తగ్గింది. ఒక దశలో ఆయన సంపద విలువ 340 బిలియన్ డాలర్ల గరిష్టస్తాయికి చేరింది. అంటే ఇప్పటికీ దాదాపు సగం మేర ఆవిరైంది.

టెస్లా కార్లు నాణ్యతలో ఫెయిల్ అవుతున్నాయి. లైట్ల సమస్య కారణంగా అమెరికాలో 3,21,000 టెస్లా కార్లను వెనక్కి పిలిచారు. ముందు సీటు ఎయిర్ బ్యాగులో సమస్యలు గుర్తించడంతో 30వేల మోడల్ ఎక్స్ కార్లను రీకాల్ చేశారు. ఈ పరిణామం ట్విటర్ కంపెనీ షేర్ 3శాతం తగ్గేలా చేసింది. కంపెనీ షేరు భారీగా ఇటీవల పడిపోవడంతో మార్కెట్ విలువ సగం మేర కోల్పోయింది.

2022 ఆగస్టు నాటికి టెస్లాలో ఎలన్ మస్క్ కు 15శాతం వాటా ఉంది. ట్విటర్ ను 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేశాక ఆయన ఆదాయం మరింత తగ్గింది. ఇలానే ముందుకు సాగితే ఆయన నంబర్ 1 స్థానం పడిపోయే ప్రమాదం ఉందని బ్లూమ్ బెర్గ్ తెలిపింది.

ఈ జాబితాలోని ఇతర కుబేరుల కంటే మస్క్ సంపదే అధికంగా హరించుకుపోతోంది. నెలరోజుల్లోనే ఎలన్ మస్క్ టాప్ 1 నుంచి టాప్ 3కి పడిపోవడం ఖాయమంటున్నారు. దీనికి ట్విటర్ నే ప్రధాన కారణంగా చెబుతున్నారు. దాని కోసం చేసిన అప్పులు, టెస్లా పతనం ఇలా అన్నీ ఈ ప్రపంచ కుబేరుడి స్థానానికి ఎసరు తెస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.