Begin typing your search above and press return to search.
ఆ కంపెనీలకు పోటీగా ఎలాన్ మస్క్ 'సార్మ్ ఫోన్' రానుందా?
By: Tupaki Desk | 27 Nov 2022 12:30 AM GMTప్రపంచ కుబేరుడు.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన వ్యాపారాలను క్రమంగా విస్తరిస్తున్నారు. ఎలక్ట్రికల్ వాహనాల తయారీ రంగంలో టెస్లాను టాప్ స్థానంలో నిలిపిన ఎలాన్ మస్క్ ఇటీవల ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నాడు. ట్విట్టర్ ను ఆదాయ వనరుగా చూస్తున్న ఎలాన్ మస్క్ తనదైన శైలిలో మార్పులు చేస్తూ ముందుకెళుతున్నారు.
గత కొన్ని రోజులు ట్విట్టర్లో అనుహ్య మార్పులు చోటు చోటు చేసుకుంటున్నాయి. ట్విటర్లో బ్లూ టిక్ వెరిఫై విధానం తీసుకొచ్చిన మస్క్ 8 డాలర్ల సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను ప్రవేశపెట్టాడు. దీనిని ట్విట్టర్ వినియోగదారులు ధృవీకరణ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం వినియోగదారులను గందరగోళానికి గురి చేస్తుండటంతో పలువురు ఈ సోషల్ మీడియాకు గుడ్ బై చెబుతున్నారు. అయినప్పటికీ ఎలన్ మస్క్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
ఈక్రమంలోనే ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ తన ట్వీటర్లో హ్యండిల్లో రోజుకో రకమైన సర్వే నిర్వహిస్తున్నారు. కస్టమర్ల అభిప్రాయాలను సేకరిస్తూ తదనుగుణంగా మార్పులు చేస్తున్నారు. మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ అప్లికేషన్ లో గూగూల్... ఆపిల్ సంస్థలు తమ ట్విట్టర్ ను యాప్ స్టోర్ నుంచి బూట్ చేస్తే వాటికి పోటీగా ప్రత్యామ్నాయ ఫోన్ తీసుకురానున్నట్లు ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడం సంచలనంగా మారింది.
ఎలాన్ మాస్క్ తీసుక రాబోయే స్మార్ట్ ఫోన్ తో అంతరిక్షంలోని వారితోనూ మాట్లాడే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఎలన్ మస్క్ 'స్పేస్ ఎక్స్ ' మిషన్ తో అంగారక గ్రహాన్ని కాలనీ మార్చాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఎలాన్ మాస్క్ స్మార్ట్ ఫోన్ ఆలోచనలు సైతం అదే రేంజులో ఉన్నట్లు అర్థమవుతోంది.
అందువల్ల ఎలాన్ మాస్క్ తీసుకురాబోయే స్మార్ట్ ఫోన్లు కూడా సరికొత్త అద్భుతాలను ఆవిష్కరిస్తాయనే అభిప్రాయాన్ని నెటిజన్లు ఆయనతో పంచుకుంటున్నారు. ఎలాన్ మస్క్ సార్ట్ ఫోన్ మార్కెట్లోకి రావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా గూగుల్.. ఆపిల్ కు వెన్నులో వణుకు పుట్టించేలా ఎలాన్ మస్క్ ఆలోచనలు ఉన్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.