Begin typing your search above and press return to search.

ఈటెలకే ఎసరు పెడుతున్నాడట...

By:  Tupaki Desk   |   9 July 2019 6:33 AM GMT
ఈటెలకే ఎసరు పెడుతున్నాడట...
X
టీఆర్ ఎస్ కు కంచుకోట కరీంనగర్. అలాంటి జిల్లా కేంద్రం కరీంనగర్ లో వరుసగా మూడు సార్లు గెలవడం అంటే మాటలు కాదు. నియోజకవర్గం ఏర్పడి నప్పటి నుంచి ఆ గెలుపులు ఎవరికీ సాధ్యం కాలేదు. అలాంటిది టీఆర్ ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సాధించాడు. టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడైన గంగుల వరుసగా గెలుస్తూ కరీంనగర్ లో ప్రతిపక్షాలను లేకుండా చేస్తున్నారు. ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులు ఇక్కడ టీఆర్ ఎస్ లో చేరుతున్నారు.

అయితే గంగుల కమలాకర్ వరుస గెలుపులతోపాటు, పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ను క్లీన్ స్వీప్ చేసేశారు. ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ పై కూడా గులాబీ జెండా ఎగురవేయడానికి గంగుల స్కెచ్ గీస్తున్నారు.. ఇది గెలిస్తే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది.

కరీంనగర్ లో వరుసగా గెలిచిన గంగులకే కేబినెట్ లో చోటు దక్కబోతోందన్న చర్చ టీఆర్ ఎస్ లో సాగుతోంది. పోయిన సారి కరీంనగర్ జిల్లాకే చెందిన బీసీ సీనియర్ నేత ఈటెలను కేసీఆర్ పక్కనపెడుతారనే వార్తలు వచ్చాయి. చివరి నిమిషంలో ఈటెలకు మంత్రి పదవి దక్కింది. ఇక రాబోయే విస్తరణలో ఈటెలకు విశ్రాంతినిచ్చి గంగులను మంత్రిని చేస్తారన్న చర్చ టీఆర్ ఎస్ లో సాగుతోంది.

వరుస గెలుపులు, కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు కావడం.. పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండే నేత కావడంతో ఈటెల ప్లేసులో ఇతడిని తీసుకోవచ్చనే చర్చ సాగుతోంది. మరి కేసీఆర్ నిజంగా ఈటెలను పక్కనపెట్టి గంగులకు చాన్స్ ఇస్తారా లేదో చూడాలి మరీ.