Begin typing your search above and press return to search.
త్వరలో ఫేస్ బుక్, ట్విటర్ మూసివేతనా?
By: Tupaki Desk | 24 Nov 2022 2:30 AM GMTఆర్థిక మాంద్యం రాకముందే ప్రపంచమంతా సర్దుకుంటోంది. ముఖ్యంగా టెక్ కంపెనీలు దొరికిందే సందు అన్నట్టుగా మాంద్యం పేరు చెప్పి ఖర్చులు తగ్గించుకునే కుటిల పన్నాగాలు పన్నుతున్నాయి. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం వచ్చాక ఉద్యోగులను తీసేయడం చూశాం. 2008లోనూ.. కరోనా లాక్ డౌన్ లోనూ ఇదే జరిగింది. కానీ ఆర్థిక మాంద్యం రాకముందే.. వస్తుందనే భయంతో ఉద్యోగులను తీసేయడం ఇప్పుడే చూస్తున్నాం.
ఆర్థికమాంద్యం వంకతో మొత్తం కార్పొరేట్ కంపెనీలు అన్ని ఖర్చు తగ్గించుకునే పనిలోపడ్డాయి. దీన్ని బట్టి ఆల్ రెడీ ఆర్థిక మాంద్యం వచ్చేసినట్టే.మాంద్యం ముందే కంపెనీలన్నీ ఉద్యోగులను తీసేస్తుండడంతో ఇక అది వచ్చినట్టే అర్తం చేసుకోవచ్చు. మాంద్యంలోకి ప్రపంచం ఎంటర్ అయినట్టే.. అందరూ భావించిన భయమే నిజం అయ్యిందని చెప్పొచ్చు.
గత వారం రోజులుగా దిగ్గజ టెక్ సంస్థల్లో ఉద్యోగాల కోతల వార్తలు వరుసగా ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. గత 12 నెలల్లో ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజాలైన యాపిల్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా (ఫేస్ బుక్) , అల్ఫాబెట్ (గూగుల్) లకు చెందిన మూడు ట్రిలియన్ డాలర్లు వరకు సంపద మార్కెట్ నుంచి ఆవిరైంది. ఇది భారత కరెన్సీలో రూ.244 లక్షల కోట్లు కావడం గమనార్హం.
దీంతో నవంబర్ లో అమెజాన్ తోపాటు చాలా టెక్ సంస్థలు భారీగా ఉద్యోగాల కోతలు ప్రకటించాయి. ఈనెల 21 నాటికి మొత్తంగా 1, 36,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. భారీగా ఉద్యోగాలను తీసేసిన సంస్థల జాబితాలో ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా మొదటి వరుసలో ఉంది. ఇందులో ఏకంగా 11వేల మందిని ఇంటికి పంపించింది. ఇక ట్విటర్ లో కూడా సగం మందిని దాదాపు 3700మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. దీంతో దిగ్గజ సోషల్ మీడియా ఫ్లాట్ ఫారాలైన ఫేస్ బుక్, ట్విటర్ ల భవిష్యత్ ఏమిటీ? సంక్షోభాలను తట్టుకొని ఈ సంస్థలు నిలబడగలవా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్ బుక్, ట్విటర్ లు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయి.వ్యాపార లావాదేవీల్లోకి వచ్చే డబ్బు తగ్గిపోతోంది. ముఖ్యంగా ప్రకటనలపై సంస్థలకు వచ్చే ఆదాయం తగ్గిపోతోంది. టెక్నాలజీ ద్వారా డబ్బులు సంపాదించాలని ప్రయత్నించే వారికి నిజంగా ఇది గడ్డుకాలం అని టెక్ నిపుణులు తెలిపారు. సోషల్ మీడియా వేదికలు సాధారణంగా ప్రకటనలపైనే ఎక్కువ ఆధారపడుతుంటాయి. అయితే ఆర్థిక మందగమనంతో ఈ ప్రకటనలు పూర్తిగా తగ్గిపోతాయి. ఫలితంగా వీటి మనుగడే ప్రశ్నార్థకం అవుతోందని అంటున్నారు. తాజాగా మెటా కూడా సంస్థ రెవెన్యూ భారీగా తగ్గిపోయినట్టు ప్రకటించింది.
ట్విటర్ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీలేదు. రెవెన్యూ పడిపోవడంతోపాటు ఎలన్ మస్క్ నాయకత్వ శైలి, ఆయన తీసుకునే నిర్ణయాలు సంస్థకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.
ఇటీవల కాలంలో అమెరికా, యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలు సోషల్ మీడియా వేదికల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చాయి. ఫలితంగా మార్కెట్ లో పోటీ ఎక్కువైంది. గతంలో ప్రత్యర్థులైన ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లను ఫేస్ బుక్ కొనేసి మార్కెట్ మొత్తాన్ని తమ ఆధానంలోకి తీసుకున్నట్టు ప్రస్తుతం చేయకుండా ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చారు. ఇక కొత్త కొత్త యాప్స్ వచ్చేసరికి పాత ఫేస్ బుక్, ట్విట్టర్ లను వాడడం లేదు. ఇక ప్రకటన దారులు కూడా కొంత పంథాలో పయనిస్తూ వీటికి ప్రకటనలు ఇవ్వడం లేదు. నేడు లాక్ డౌన్ లో పతాకస్తాయికి చేరిన ఫేస్ బుక్ , ట్విటర్ ఆదాయం.. నేడు అదే ఆదాయం పంచుకుంటున్నాయి. వినియోగదారుల కోసం ఎక్కువ కంపెనీలు పోటీ పడుతున్నాయి.
దశాబ్ధం క్రితం గూగుల్ కు చెందిన ‘ఆర్కుట్’ ప్రపంచంలో మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా వేదికగా ఉండేది. కానీ 2014లో ఫేస్ బుక్ రాకతో అది చరిత్రలో కలిసిపోయింది. నేటి కొత్త సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లు కూడా అంతే. ఫేస్ బుక్, ట్విటర్ కంటే కొత్త యాప్స్ వినియోగదారులను, కంపెనీలను ఆకట్టుకుంటున్నాయి. బెబో, మైస్పేస్, వైన్ లాంటి సోషల్ మీడియాలు కనుమరుగైనట్టే ‘ఫేస్ బుక్, ట్విటర్’ కూడా సంక్లిష్టమైన దశలోకి అడుగుపెట్టడం ఖాయం అని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.