Begin typing your search above and press return to search.

కమ్యూనిస్టు 'గద్దర్'కు చివరకు 'కాషాయం' దిక్కవుతోందా?

By:  Tupaki Desk   |   6 Sep 2022 7:30 AM GMT
కమ్యూనిస్టు గద్దర్కు చివరకు కాషాయం దిక్కవుతోందా?
X
ఒకప్పుడు నక్సలైట్ గా పోలీసులతో పోరాడారు. జనజీవన స్రవంతిలో కలిసి కమ్యూనిస్టు యోధుడిగా నినదించాడు. అనంతరం తెలంగాణ ఉద్యమం కోసం కాలు గజ్జకట్టి ఆడాడు. తెలంగాణ కోసం పోరాడారు. అయితే ఈ చివరి దశలో ఈ ఎరుపు రంగు పులుముకున్న గద్దర్ కు 'కాషాయ' కండువానే దిక్కవుతోందా? అన్న ప్రచారం సాగుతోంది.

వామపక్ష భావజాలంలో ఉండే గద్దర్ ఇటీవల బండి సంజయ్ ను కలిసి చర్చలు జరపడంతో ఈ ఊహాగానాలు తలెత్తాయి. పార్లమెంట్ భవనం పేరు కోసం కలిశానని అంటున్నా ఈ ప్రచారం మాత్రం ఊపందుకుంది. రాజకీయాల్లో పెద్దగా రాణించని గద్దర్ ను అన్ని పార్టీలు వాడుకొని ఆయనకు ఓ పెద్ద పదవిని ఇవ్వలేకపోయాయి. ఏ పార్టీకి సపోర్టు చేసినా కూడా ఆయన అత్యున్నత స్థాయికి రాలేకపోయారు.

దీంతో నవతరం రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకోవాలని గద్దర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చని.. కమ్యూనిస్టు గద్దర్.. బీజేపీలో చేరిపోవచ్చు అంటూ కథనాలు వెలువడుతున్నాయి. తాను వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి చర్చలు జరపడంతో అందరూ అదే అనుకుంటున్నారు.

పార్లమెంట్ పేరు కోసం బండి సంజయ్ ను కలిస్తే ఏం లాభం లేదు. అదంతా మోడీ, అమిత్ షాలతోనే అవుతుంది. బండి నిమిత్తమాత్రుడు. సో బండిని కలవడం వెనుక ఖచ్చితంగా రాజకీయం ఉందని అంటున్నారు.

ఇక కొత్త పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలన్న గద్దర్ డిమాండ్ కూడా బీజేపీ పరిశీలించే అవకాశాలు లేవు. బీజేపీ అంటేనే బీసీలు, అగ్రవర్ణ ఓసీల జపం చేస్తోంది. దీంతో పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెడుతారన్నది అత్యాశే.

దీన్ని బట్టి గద్దర్ ప్రస్తుతం చేరికల కోసం అర్చులు చాస్తున్న బీజేపీ వైపు చూస్తున్నారని.. ఆ పార్టీలో చేరడానికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.