Begin typing your search above and press return to search.

గంటా షాక్ ఇస్తారా... ?

By:  Tupaki Desk   |   11 Oct 2021 12:20 PM GMT
గంటా షాక్ ఇస్తారా... ?
X
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పొలిటికల్ రూట్ ఏంటి అన్నది ఇపుడు రాజకీయ వర్గాలలో చర్చగా ఉంది. గంటా సీనియర్ మోస్ట్ నేత. ఆయనది సక్సెస్ ఫుల్ పాలిటిక్స్. 1999లో అనకాపల్లి ఎంపీగా టీడీపీ ద్వారా కెరీర్ మొదలెట్టిన గంటా 2019 వరకూ అధికార హోదాలోనే ఉన్నారు. ఇక గడచిన రెండున్నరేళ్ళుగా ఆయన సైలెంట్ స్పెక్టేటర్ గా మారిపోయారు. ఇవన్నీ పక్కన పెడితే గంటా టీడీపీకి దూరం జరుగుతున్నారని అన్న వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ ఏడాది మొదట్లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దానికి స్పీకర్ ఫార్మెట్ లో పంపించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలోని స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఇంటికి స్వయంగా వెళ్ళి మరీ రాజీనామా ఇచ్చి వచ్చారు. ఇప్పటికీ దాని మీద స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇవన్నీ ఇలా ఉంటే గంటా తన రాజీనామాను ఈసారి టీడీపీ అధినాయకత్వానికి పంపించారు అన్న ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. దీని మీద అధినాయకత్వం తొందరగా నిర్ణయం తీసుకోవాలని కూడా గంటా కోరినట్లుగా చెబుతున్నారు.

గంటా ఒక వ్యూహం ప్రకారమే తన రాజీనామా మీద వత్తిడి తెస్తున్నారు అంటున్నారు. గంటా తొందరలోనే జనసేనలో చేరుతారు అన్న మాట కూడ గట్టిగా వినిపిస్తోంది. ఆయన ఈ మేరకు కార్యాచరణను రెడీ చేసుకున్నారని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే ఆయన త్వరలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ ని కలుస్తారు అని కూడా ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. ప్రజారాజ్యం టైమ్ లో ఉత్తరాంధ్రా పార్టీ వ్యవహారాలను మొత్తం చూసిన గంటా ఇపుడు కూడా జనసేనలో కీలకం కానున్నారు అంటున్నారు. అంతే కాదు, నాడు ప్రజారాజ్యంలో పోటీ చేసిన వారు కూడా తిరిగి జనసేనలో రావడానికి గంటా కృషి చేస్తారు అని కూడా చెబుతున్నారు. ఉత్తరాంధ్రా ఉభయ గోదావరి జిల్లాల మీద భారీ ఆశలు పెట్టుకున్న జనసేన గంటా మీద అతి ముఖ్యమైన బాధ్యతలు పెట్టనుంది అంటున్నారు. మొత్తానికి చూస్తే గంటా టీడీపీకి షాక్ ఇస్తారన్నది తేలుతున్న వ్యవహారం. చూడాలి మరి రాజకీయ తెర మీద ఏం జరుగుతుందో.