Begin typing your search above and press return to search.
మోడీతో జగన్ భేటీపై ఈ విశ్లేషణ వింటే మైండ్ బ్లాంకే!
By: Tupaki Desk | 8 April 2022 5:28 AM GMTఊహలకు రెక్కలు ఉండవంటారు. ఈ మాటకు ఇట్టే సెట్ అయ్యే రాజకీయ విశ్లేషణ ఒకటి తాజాగా వినిపిస్తోంది. గతంలో ఇలాంటి మాటలు నలుగురి మధ్యనే నలిగిపోయేవి. బయటకు రావాలన్నా.. పక్కకు విస్తరించాలన్నా సాధ్యమయ్యేది కాదు. దరిద్రపుగొట్టు సోషల్ మీడియా.. వాట్సాప్ పుణ్యమా అని.. మనసులోకి వచ్చే ప్రతి ఆలోచనను తమ చుట్టూ ఉన్న వారి మనసుల మీద రుద్దేసే తీరు ఈ మధ్యన ఎక్కువైంది. ఏదైనా రాజకీయ పరిణామం చోటు చేసుకున్నంతనే.. దానికి తమదైన విశ్లేషణ ఒకటి తెర మీదకు తీసుకొచ్చి..దానికో అందమైన లాజిక్కు వినిపించే తీరు.. తమ ఆలోచనలకు తగ్గట్లుగా ఆలోచించే వారిని జత కట్టుకొని.. తమ ఊహలకు ప్రచారం చేసుకునే వాళ్లు ఎక్కువ అయ్యారు.
తాజాగా ఒక విచిత్రమైన విశ్లేషణ ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది. సదరు విశ్లేషణకు మూలం.. తాజాగా మంత్రులందరిని సీఎం జగన్ మాజీలు చేయటం. ఈ కార్యానికి ముందు ఢిల్లీకి వెళ్లిన సీఎం.. ప్రధాని మోడీతో భేటీ కావటం తెలిసిందే. మోడీతో భేటీని.. మంత్రుల్ని మాజీల్ని చేసే అంశాల్ని లింకు పెట్టేసిన వైనం చూస్తే.. వారి తెలివికి ఫిదా కావాల్సిందే.
ప్రధాని నరేంద్ర మోడీని జగన్ మాష్టారు ఎందుకంత అర్జెంట్ గా కలిసారన్న దాన్ని తాజా విశ్లేషణ వింటే మైండ్ బ్లాంక్ కావాల్సిందే. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ విశ్లేషణలోకి వెళితే.. మంత్రుల్ని మాజీల్ని చేసిన సీఎం జగన్ మరో మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా సదరు విశ్లేషణ చెబుతోంది.
మంత్రుల్ని మాజీల్ని చేసిన తర్వాత సహజంగానే వారికి తన మీద కోపం వస్తుంది. కొత్త మంత్రుల తీరుతో వారి ఇగో హర్ట్ అవుతుంది. తమ అధిక్యతను నిరూపించుకోవటం కోసం వారు ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతుకుతారు. అలాంటి వేళలో వారికి కనిపించేది బీజేపీనే. మంత్రులుగా ఉన్నన్ని రోజులు టీడీపీని దారుణంగా తిట్టేసి.. మళ్లీ ఆ పార్టీలోకి పోరని.. ఉన్న ఏకైక అవకాశం బీజేపీకే కాబట్టి.. మాజీల్లో ఎక్కువ మంది కమలం గూటికే చేరుతారట. అలాంటి వారిని ఆహ్వానించి.. పార్టీలో చోటు కల్పిస్తారు.
సరిగ్గా ఎన్నికలకు కాస్త ముందు.. బీజేపీతో వైసీపీ పొత్తు ఖాయమవుతుంది. కొత్త మంత్రుల బలం.. పాత మంత్రుల అనుభవం తోడు కావటంతో పాటు.. తమ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకునే వేళ.. వారికి వైరి వర్గంగా వైసీపీ - బీజేపీ పొత్తు పెట్టుకుంటారని.. ఎన్నికల్లో తమ లక్ష్యమైన 151 సీట్లను నిలుపుకుంటారంటూ విశ్లేషిస్తున్నారు.
ఇందులో సాధ్యాసాధ్యాల కంటే కూడా.. చదివినంతనే.. ఏమో ఆ అవకాశం కూడా ఉండొచ్చు.. అన్న భావన కలిగేలా ఉండటమే ఈ విశ్లేషణ ప్రత్యేకతగా చెప్పక తప్పదు. ఈ తరహా విశ్లేషణలు వింటే మైండ్ బ్లాంక్ కాక మరేమవుతుంది చెప్పండి?