Begin typing your search above and press return to search.

ఆజాద్ సక్సెస్ అవుతారా ?

By:  Tupaki Desk   |   27 Sep 2022 4:54 AM GMT
ఆజాద్ సక్సెస్ అవుతారా ?
X
కాంగ్రెస్ పార్టీ మాజీనేత గులాం నబీ ఆజాద్ కాశ్మీర్ లో కొత్త పార్టీ పెట్టారు. తన పార్టీ పేరును 'డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ' (డీఏపీ) గా ప్రకటించారు. అంటే పార్టీ పేరులోనే తన పేరుకూడా ఉండేట్లుగా ఆజాద్ జాగ్రత్తపడ్డారన్నమాట.

మంచిదే ఈ నేత పేరు తలచుకున్నా, పార్టీపేరు తలచుకున్నా ఆజాద్ అనే ప్రస్తావన మాత్రం తప్పకుండా వస్తుంది. సరే పార్టీ పెట్టడం ఏమంత పెద్ద కష్టమేమీకాదు. ఓ పదిమిందిని పార్టీలో చేర్చుకుంటే సరిపోతుంది.

కాంగ్రెస్ లో నుండి ఆజాద్ బయటకు వచ్చేయగానే జమ్మ-కాశ్మీర్లోని తన మద్దతుదారులు కొందరు పార్టీకి రాజీనామా చేసేశారు. అంతాబాగానే ఉందికానీ ఇపుడు పార్టీ పెట్టిన ఆజాద్ సక్సెస్ అవుతారా ? అనేది పెద్ద ప్రశ్నగా మారింది.దీనికి కారణం ఏమిటంటే ఆజాద్ వయసు సుమారు 76 ఏళ్ళు. ఇంత లేటు వయసులో పార్టీ పెట్టడంతో పాటు దాన్ని ఎన్నికల్లో గెలిపించుకోవటం అంటే మాటలుకాదు. పైగా ఆజాద్ ఏమీ ప్రజాకర్షణ ఉన్న నేతకాదు.

కాంగ్రెస్ పుణ్యామని దశాబ్దాలపాటు ప్రముఖుడిగా చెలామణి అయిపోయారంతే. మొన్నటికిమొన్న పంజాబ్ లో కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసిన మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్తగా పార్టీ పెట్టి అట్టర్ ఫ్లాప్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

పార్టీ తరపున పోటీచేసిన మొత్తం 117 మంది అభ్యర్ధులూ చిత్తుగా ఓడిపోయారు. మరి కెప్టెన్ కూడా పంజాబ్ లో ప్రముఖనేతగానే చెలామణయ్యారు. మరి కొత్తపార్టీ పెడితే ఎందుకని చిత్తుగా ఓడిపోయారు ?

ఎందుకంటే వయసే ప్రధాన సమస్య.పైగా కాశ్మీర్లో ఇప్పటికే లోకల్ పార్టీలు చాలా ఉన్నాయి. కాకపోతే ఆజాద్ పార్టీ పెట్టడం వల్ల బీజేపీకి ఉపయోగం ఉంటే ఉండచ్చు కొన్ని చోట్ల. ఎందుకంటే ముస్లిం ఓట్లను ఆజాద్ చీల్చితే చీల్చవచ్చు. ముస్లిం ఓట్లు బీజేపీకి పడకపోయినా మిగిలిన పార్టీల మధ్య చీలిపోతే లాభపడేది బీజేపీనే కదా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.