Begin typing your search above and press return to search.
కొత్త ప్రయోగం : వైసీపీలో కలి పుట్టిస్తుందా...?
By: Tupaki Desk | 21 Jun 2022 12:30 PM GMTరాజకీయాలను ట్రెడిషనల్ రూట్ నుంచి మార్చే కొత్త దారుల్లోకి తెచ్చిన ఘనత జగన్ దే. ఆయన అందరూ నడిచే బాటలో నడవరు. ఆయన రూటే సెపరేట్ అన్నట్లుగా ఉంటారు. ఇదిలా ఉంటే జగన్ ఇపుడు మూడేళ్ళ సీఎం గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయం అయితే ఆయనలో స్పష్టంగా ఉంది. దానికి పరిస్థితులు ఎంతలా దోహదపడతాయి అన్నది చూడాలి. అయితే ఏపీలో తన బలం ఎంత విపక్షం బలం ఎంత అన్న దాని మీద జగన్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారని తెలుస్తోంది.
ఏపీలో గడపగడపకు కార్యక్రమం వెనక ఉన్న కారణం అదే అంటున్నారు. వైసీపీకి జనాలలో ఉన్న ఆదరణ నిరాదరణ ప్రత్యక్షంగా తెలుసుకోవడమే దీని అసలు ఉద్దేశ్యం. దానితో పాటు అనేక ఇతర మార్గాల ద్వారా సర్వేలు చేస్తున్నారు. మొత్తానికి వైసీపీ హై కమాండ్ కి అర్ధమైన విషయం ఒకటి ఉంది అంటున్నారు. అదే జనాల్లో వ్యతిరేకత అయితే ఉంది. దానికి కారకులు ఎవరు అన్నది అన్వేషించే పనిలోనే ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఉంది.
ప్రభుత్వ పాలసీల్లో లోపాలు ఉంటే దాన్ని చక్కదిద్దుకోవాలని చూస్తోంది. అందుకే అభివృద్ధి విషయంలో రానున్న రెండేళ్ళ పాటు గట్టిగా కృషి చేయాలని ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే టైమ్ లో మంత్రుల మీద అసంతృప్తి ఉంటే దానికి కూడా విరుగుడు మంత్రం ఆలోచించారు అని తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యే విషయమే ఇపుడు అతి పెద్ద చర్చగా ఉంది.
ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే ఎక్కువ వ్యతిరేకత అయితే గ్రౌండ్ లెవెల్ లో వస్తోంది అని అంటున్నారు. దానితో పనిచేయని వారిని తప్పించేసి కొత్త వారికి చాన్స్ ఇవ్వాలన్న ఆలోచన పార్టీలో ఉందిట. ఈ విషయాలను జగన్ ప్లీనరీలోనే ప్రకటించి సంచలనం రేపుతారని అంటున్నారు. అంటే రెండేళ్ళ ఎన్నికలకు ముందే కొత్త అభ్యర్ధిని కొన్ని నియోజకవర్గాలలో ప్రకటించడం అన్న మాట.
ఇది నిజంగా కొత్త ప్రయోగం కాదు షాకింగ్ ప్రయోగంగా చెప్పాలి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా రేపటి ఎన్నికల్లో నేనే అభ్యర్ధిని అని వేరే వారు చెప్పుకుంటే ఒకే ఒరలో రెండు కత్తులు ఉన్నట్లుగా సీన్ ఉంటుంది. అంతే కాదు వర్గ పోరు కూడా పీక్స్ లో ఉంటుంది. కొత్త అభ్యర్ధి ఫీల్డ్ లోకి వచ్చి దున్నేస్తే సిట్టింగ్ ఎమ్మెలెయ డమ్మీ అయిపోతారు.
మరి ఇంతటి ప్రమాదం ఉంటుందని తెలిసినా వైసీపీ ఈ డెసిషన్ ఎందుకు తీసుకుంటోంది అన్నదే ఆసక్తికరమైన చర్చ. పనిచేయని వారిని మరో రెండేళ్లు ఉంచుకున్నా పెంచుకున్నా ఏమిటి ఉపయోగం అన్నదే అధినాయకత్వం ఆలోచనగా ఉంది అంటున్నారు. అదే వారిని పక్కన పెట్టేసి కొత్త వారినే దింపితే ఫలితాలు బాగుంటాయని, వారు కూడా జనాల్లోకి ఇప్పటి నుంచి వెళ్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.
ఈ విధంగా చేస్తే అసలు ఎమ్మెల్యే కొసరు ఎమ్మెల్యే అయిపోతారు. జనాలు అయిదేళ్ళకు అధికారం ఇస్తే వైసీపీ మాత్రం మూడేళ్లకే చాలు బాబు అంటుంది అన్న మాట. మరి వారు ఏం చేస్తారు అంటే ఉంటే పార్టీలో ఉండి కొత్త వారికి సహకరించడం. లేదు అంటే వారు వేరే పార్టీలోకి జంప్ చేయడం. ఇది కూడా ఊహించే ఈ ప్రయోగం చేస్తోంది అంటున్నారు.
ఎన్నికల వేళకు కాస్తా ముందు మార్చితే వెళ్ళిపోయే వారు భారీ నష్టం చేస్తారని, ఇపుడే వారికి చెబితే ఉంటే ఉంటారు, లేకపోతే నష్టం కూడా పెద్దగా ఉండదని, దాన్ని పూడ్చుకోగలమని భావిస్తున్నారుట. ఏది ఏమైనా ఇది సరికొత్త ప్రయోగం, దేశ రాజకీయ చరిత్రలో ఒక అధికార పార్టీ చేయని ప్రయోగం, మరి వైసీపీ ప్లీనరీలో దీనిని అమలు చేయలని చూస్తోందిట. కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాలలో అలా చేస్తారట. చూడాలి మరి.