Begin typing your search above and press return to search.
రాహుల్ కి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా...?
By: Tupaki Desk | 19 Aug 2022 1:30 AM GMTరాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్ర నాయకుడు. రేపటి రోజున అన్నీ కలసి వస్తే ఈ దేశానికి ప్రధాని కాదలుచుకున్న నాయకుడు. అలాంటి రాహుల్ తన పార్టీని బలోపేతం చేయడం కోసం దేశ వ్యాప్త యాత్రను వచ్చే నెల నుంచి చేపడుతున్నారు. రాహుల్ యాత్ర తొందరలొనే ఏపీలో కూడా అడుగు పెట్టే అవకాశం ఉంది. ఏపీని టచ్ చేస్తూ రాహుల్ యాత్రను లేటెస్ట్ గా డిజైన్ చేశారు.
అది ఏపీలో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు నాలుగు అసెంబ్లీ సీట్ల నుంచి సాగుతుంది అని అంటున్నారు. ఇక రాహుల్ ఏపీకి వచ్చి చాలా కాలం అయింది. అంతే కాదు ఆయన ఏపీ కాంగ్రెస్ ని కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఇపుడు రాహుల్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని లేపబోతున్నారు. అందులో ఏపీ కూడా ఉంది. కాంగ్రెస్ ఏపీలో ఎక్కడ దెబ్బ తిందో రాహుల్ కి స్పష్టంగా తెలుసు.
అంతే కాదు కాంగ్రెస్ కి ఆస్తి లాంటి ఓటు బ్యాంక్ అంతా జగన్ వద్దకే చేరింది అని కూడా తెలుసు. ఒక విధంగా తన ఓటు బ్యాంక్ ని తిరిగి పొందడానికి రాహుల్ ఏపీలో పాదయాత్ర పెట్టుకున్నారు. మొదట పాదయాత్ర రూపకల్పనలో ఏపీ ఎక్కడా లేదు. కానీ కాంగ్రెస్ హై కమాండే కోరి మరీ పెట్టించింది అని అంటున్నారు. అంటే ఏపీ మీద రాహుల్ కి ప్రత్యేక ఫోకస్ ఉంది అని అర్ధమవుతోంది.
ఇక పాదయాత్ర అంటే రాహుల్ నడచుకుంటూ వెళ్ళిపోరు కదా. ఏపీ సర్కార్ మీద ఘాటైన విమర్శలు చేస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ హామీ ఇస్తే దాన్ని తూట్లు పొడిచారు అని నిప్పులు చెరుగుతారు. అలాగే పోలవరాన్ని అయిదేళ్ళ కాలంలో పూర్తి చేసేలా తాము విభజన చట్టంలో పెడితే బీజేపీతో కలసి వైసీపీ ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా చెప్పడం లేదని కూడా ఫైర్ అవుతారు.
అలాగే ఏపీకి రాజధాని లేకపోవడాన్ని కూడా ఆయన ప్రస్థావిస్తారు. ఇలా అనేక అంశాలతో పాటు అభివృద్ధి లేమి, అప్పుల ఆంధ్రాతో సహా మోడీతో జగన్ కలసి ఉండడాన్ని కూడా చెప్పి మరీ మైనారిటీలను ఇటు వైపునకు లాగే వ్యూహానికి పదును పెడతారు. మొత్తానికి రాహుల్ ఏపీకి వస్తే జగన్ మీద సమర శంఖమే పూరిస్తారు అన్నది నిజం.
అలాంటి రాహుల్ ఏపీలో అడుగుపెట్టాలంటే జగన్ అనుమతి ఇవ్వాలి. ఇక్కడో ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పుకోవాలి. జగన్ కాంగ్రెస్ ఎంపీగా ఉండగా ఆయన తండ్రి నాటి సీఎం వైఎస్సార్ మరణించారు. ఆ తరువాత జగన్ ఓదార్పు యాత్ర నిర్వహిస్తాను అంటే అడ్డుకున్నది రాహుల్ గాంధీ సోనియా గాంధీ. దాన్ని మనసులో పెట్టుకుని జగన్ కాంగ్రెస్ కి రాం రాం చెప్పేసి బయటకు వచ్చారు. పార్టీ పెట్టుకుని సీఎం కూడా అయ్యారు.
మరి తనను నాడు అడ్డుకున్న రాహుల్ ఏపీలో పాదయాత్ర నిర్వహిస్తాను అంటే జగన్ ఊరుకుంటారా. ఆయనకు అనుమతి ఇస్తారా. మొత్తానికి ఓడలు బళ్ళు అవుతాయని అంటారు. రాహుల్ పాదయాత్రకు జగన్ అనుమతి ఇవ్వడం అంటే ఇదే కదా. మరి జగన్ ఎలా రియాక్ట్ అవుతారో కూడా ఆసక్తిని కలిగించే అంశమే.