Begin typing your search above and press return to search.
ఇంతకీ కౌశిక్ రెడ్డికి కేసీఆర్ టికెట్ ఇస్తాడా? ఇవ్వడా?
By: Tupaki Desk | 22 July 2021 4:37 AM GMTహుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ చార్జిగా ఉన్న కౌశిక్ రెడ్డి ‘ఆడియో లీక్’ల వ్యవహారంలో ఇరుక్కొని ఆ పార్టీకి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. అనూహ్యంగా టీఆర్ఎస్ లో చేరాల్సిన పరిస్థితులొచ్చాయి. ఇక అధికార పార్టీలో చేరితే గెలుపు ఈజీగా ఉంటుందని కౌశిక్ రెడ్డి ఈ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న సాదరంగా కౌశిక్ రెడ్డి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఈ పండుగ అంగరంగ వైభవంగా జరిపించారు కౌశిక్ రెడ్డి.
అయితే కౌశిక్ రెడ్డి చేరిక సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డిని ప్రోత్సహించడానికి ప్రయత్నించారు. కానీ హుజూరాబాద్ టికెట్ పై మాత్రం నోరు మెదపలేదు. ‘కౌశిక్ రెడ్డి రాజకీయాల్లో ఒక యువకుడు. అతడు అపారమైన ప్రజా సేవ చేయగలడు. తన రాజకీయ వృద్ధిని ఎవ్వరూ ఆపలేరు. ఆయనకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. అతడి పురోగతికి నేను మంచి మార్గం వేస్తానని హామీ ఇస్తున్నా’ అని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
కౌశిక్ రెడ్డి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ‘నాకు కౌశిక్ తాత సుధాకర్ రెడ్డి, అతడి పెద్ద కుమారుడు కృష్ణారెడ్డితో మంచి సంబంధాలున్నాయి. కౌశిక్ తండ్రి తెలంగాణ ఆందోళనల్లో నాతో కలిసి పనిచేశారు’ అని ఆయనను కూల్ చేసే ప్రయత్నాలు కేసీఆర్ చేశారు.
నిజానికి నిన్న చేరికల వ్యవహారంలో కౌశిక్ రెడ్డికి కేసీఆర్ హుజూరాబాద్ టికెట్ పై ఎలాంటి హామీ ఇవ్వలేదు. ప్రకటన చేయలేదు. అతడికి భవిష్యత్ ఉందంటూ పెండింగ్ లో పెట్టే మాటలు మాట్లాడినట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
నాయకులపై ప్రశంసలు కురిపించి వెంటనే వారికి హామీలు ఇవ్వడం కేసీఆర్ కు అలవాటు. కానీ టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థికి సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రెస్ మీట్ సందర్భంగా కేసీఆర్ ఏ పేరును వెల్లడించలేదు.
బహుశా ఆడియో టేపుల లీకుతో కౌశిక్ రెడ్డిపై నెగెటివ్ ఎక్కువైపోయిందని.. అందుకే ఆ ప్రతికూల ప్రచారాన్ని పరిగణలోకి తీసుకొని టికెట్ పై కేసీఆర్ ఇప్పుడే ప్రకటన చేయకపోవచ్చని తెలుస్తోంది.