Begin typing your search above and press return to search.

మీ మామ నక‌లీ ఎస్టీ..కేటీఆర్ విచార‌ణ చేసే ద‌మ్ముందా?

By:  Tupaki Desk   |   9 Dec 2017 5:40 PM GMT
మీ మామ నక‌లీ ఎస్టీ..కేటీఆర్ విచార‌ణ చేసే ద‌మ్ముందా?
X
కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంత‌రం మొట్ట‌మొద‌టి సారి తెలంగాణ ఫైర్‌ బ్రాండ్ లీడ‌ర్ - కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గాంధీభ‌వ‌న్‌ కు వ‌చ్చారు. కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రేవంత్ రావ‌డం విశేషం. గాంధీభవన్‌ లో సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాగా, ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌ల‌తో పాటుగా...రేవంత్ కూడా ప్ర‌సంగించారు. అయితే ఈ సంద‌ర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. మంత్రి కేటీఆర్ మామ న‌కిలీ ఎస్టీ అని రేవంత్ ఆరోపించారు. ఆయ‌న‌పై విచార‌ణ చేసే ద‌మ్ముందా అని నిల‌దీశారు.

గాంధీ భవన్‌లో మొద‌టి సారి రావ‌డం, సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌ పునరేకీకరణే తుది దశ ఉద్యమంగా తాము ఉద్యమం నడుపుతామని రేవంత్‌ రెడ్డి అన్నారు. డిసెంబర్‌ 9 తెలంగాణ ఇచ్చిన రోజుగా ప్రాధాన్యత ఉందన్నారు. నలుగురి చేతిలో తెలంగాణ బందీ అయిందని పేర్కొన్నారు. తుది దశ ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్‌ జెండా మోస్తున్నామని రేవంత్‌ రెడ్డి అన్నారు.

ఈ సంద‌ర్భంగా కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌పై రేవంత్ సంచల‌న ఆరోప‌ణ‌లు చేశారు. `కేటీఆర్ భార్య .. శైలిమ .. నాకు చెల్లి లాంటిది. ఆమె పాకాల హరనాథ్ రావు.. బిడ్డ.. ఆయన.. కేటీఆర్ మామ ఎస్టీ సర్టిఫికెట్ తో ప్రభుత్వ ఉద్యోగం చేశాడు. శైలిమ కులం ఏమిటో సమాధానము చెప్పాలి. ఈ వేదిక మీద నుండి ఫిర్యాదు చేస్తున్న కేసీఆర్...నీ వియ్యంకుడు తప్పుడు సర్టిఫికెట్ తో ఉద్యోగం చేసాడు మరి అరెస్ట్ చేస్తావా? గిరిజనుల బెనిఫిట్ పొందిన వ్యక్తిని అరెస్ట్ చేస్తారా లేదా కేటీఆర్ కు బాధ్యత ఉంది నీ సతీమణి ఏ వర్గమో చెప్పాలి. సీఎం నువ్వు నీ కుటుంబం పారదర్శకంగా ఉంటారా లేదా.. నా ఆరోపణ తప్పైతే నా మీద కేస్ పెట్టండి` ఈ రోజు డిసెంబర్ 9. నేటి నుండి కేసీఆర్ రోజులు లెక్కపెట్టుకోవాలి. అని హెచ్చ‌రించారు.

ఇదిలాఉండ‌గా....కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని టీ.పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. గడిచిన మూడుననరేళ్లలో 7వేల ఉద్యోగాలు కూడా కేసీఆర్‌ సర్కార్‌ భర్తీ చేయలేకపోయిందని విమర్శించారు. భర్తీకాని ఉద్యోగాలను అధికారంలోకి రాగానే భర్తీ చేస్తామన్నారు. అలాగే, 3వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. పత్తి - మిర్చి పంటలకు మద్దతు కల్పిస్తామన్నారు.