Begin typing your search above and press return to search.
కిషన్ రెడ్డికి ఎసరుపెడుతున్న టీఆర్ ఎస్!
By: Tupaki Desk | 25 Oct 2018 2:30 PM GMTబీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి మరోసారి ఎన్నికల బరిలోకి దిగబోతున్నాడు. వరుసగా మూడు సార్లు అంబర్ పేట నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. నాలుగోసారి బరిలో నిలుస్తున్నాడు. అంబర్ పేటలో కిషన్ రెడ్డికి మంచి పట్టుంది. ప్రజలు, స్థానిక నేతలు - కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలను తీరుస్తాడనే పేరుంది. నియోజకవర్గంలో పనులు చేసే నేతగా పేరుంది. మరి ఈసారి కూడా కిషన్ రెడ్డి గెలుస్తాడా.? మూడు సార్లు గెలిచిన అసమ్మతి ఆయనకు చేటుతెస్తుందా చూడాలి మరి..
కిషన్ రెడ్డి 2019 ఎన్నికల కోసం పకడ్బందీగా ముందుకెళ్తున్నారు. పార్టీ కార్యకర్తలకు చేరువకావడానికి పలు కార్యక్రమాలను చేపట్టారు. అయితే కిషన్ రెడ్డి గెలుపు గాలివాటంగా వచ్చింది కాదు.. గడిచిన మూడు సార్లు టీడీపీ బలం, ఓటు బ్యాంకుతో కిషన్ రెడ్డి గెలుస్తూ వచ్చాడు. టీడీపీతో పొత్తు పెట్టుకొని పోయిన సారి గెలిచారు. ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ తో కలిసి మహాకూటమిగా బరిలోకి దిగుతోంది. ఇది కిషన్ రెడ్డి అవకాశాలను దెబ్బతీసే అంశం. ఇదీకాక అంబర్ పేటలో ద్వితీయ శ్రేణి నాయకుల్లో కిషన్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తి ఉంది.
2014 ఎన్నికల్లో కిషన్ రెడ్డి 62వేల ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. కానీ ఏడాది తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఈ నియోజకవర్గంలో ఒక్క కార్పొరేటర్ సీటు కూడా గెలువలేకపోయింది. కిషన్ రెడ్డి ఏరికోరి కేటాయించిన ఆయన అనుచరులు కూడా కార్పొరేటర్లుగా గెలువకపోవడం గమనార్హం. ఇదే బీజేపీ పట్టును నియోజకవర్గంలో కోల్పోయేలా చేసింది.
ప్రస్తుతం కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్ పేట నియోజకవర్గంలో గెలిచిన ఐదుగురు టీఆర్ ఎస్ కార్పొరేటర్లు కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. పలువురు బీజేపీ నేతలను వారు గులాబీ పార్టీకి ఆకర్షించారు. ఇది కిషన్ రెడ్డికి పెద్ద సవాల్ గా మారింది. ఇక అంబర్ పేటలో అశేషంగా ఉన్న ముస్లిం ఓట్లు కూడా ఎంఐఎం కు పడే అవకాశాలున్నాయి. ఇది కూడా కిషన్ రెడ్డికి ఆందోళన కలిగించే అంశం.. మరి వీటన్నింటిని తట్టుకొని కిషన్ రెడ్డి నిలబడతాడా లేదా అన్నది వేచి చూడాల్సిందే..