Begin typing your search above and press return to search.
కోహ్లీ కొంప మునుగుతుందా? మీనన్‌తో దూకుడే రీజన్!!
By: Tupaki Desk | 16 Feb 2021 5:30 PM GMTఔను! టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చుట్టూ ఇప్పుడు విమర్శలు, వివాదాలు చెలరేగుతున్నాయి. ఏకంగా ఆయన సస్పెండ్ అయ్యే ప్రమాదంలో ఉన్నాడని అంటున్నారు క్రీడానిపుణులు. ఆన్‌ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్‌తో కోహ్లీ వాగ్వాదానికి దిగడమే దీనికి కారణంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో అక్షర్ పటేల్ బౌలింగ్ చేస్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. అక్షర్ విసిరిన బంతి నేరుగా వికెట్ల మీదకు రావడంతో ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ దానిని ఆడేందుకు ప్రయత్నించాడు.
అయితే, బంతి అతడి ప్యాడ్‌కు తాకి వెనక్కి వెళ్లింది. దీనిని పట్టుకున్న పంత్ అవుట్‌కు అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ నితిన్ మీనన్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీనిపై కొహ్లీ రివ్యూకు వెళ్లడంతో బంతి ప్యాడ్‌కు తాకిందని తేలింది. అయితే, నేరుగా ప్యాడ్‌కు తాకడంతో థర్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూ కోణంలోనూ చెక్ చేయడం జరిగింది.
అందులో బంతి వికెట్లను తాకుతున్నట్లు తేలింది. అయితే బంతి పిచ్ పడిన చోటు అంపైర్స్ కాల్‌గా ఉండడంతో నాటౌట్‌గా ప్రకటించారు. దీంతో కోహ్లీకి కోపమొచ్చి నేరుగా అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.
అంపైర్ సర్ది చెబుతున్నా వినకుండా వాదించాడు. కోహ్లీ ప్రవర్తన కొందరు మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ అలా ప్రవర్తించి ఉండకూడదని అంటున్నారు. దీనిని విశ్లేషిస్తున్న క్రీడా నిపుణులు.. కోహ్లీ చేసిన తప్పు లెవెల్ 1 లేదా లెవెల్ 2 తప్పిదంగా పరిగణించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇలాంటి తప్పులకు సదరు ఆటగాడికి ఒకటి నుంచి నాలుగు డీ మెరిట్ పాయింట్స్ ఇచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అదే జరిగితే ఇప్పటికే అతడిపై ఉన్న రెండు డీ మెరిట్ పాయింట్స్‌తో కలిపి మొత్తం ఓ టెస్టు మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది. మొత్తానికి ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో కోహ్లీ దూకుడు సంచలన టాపిక్‌గా మారడం గమనార్హం.