Begin typing your search above and press return to search.
లాస్ట్ చాన్స్ .. ఈసారి మిస్ అయితే కోహ్లీ పని ఖతమే?
By: Tupaki Desk | 7 July 2022 12:32 PM GMTఇటీవల బీసీసీఐలో , టీం మేనేజ్ మెంట్ లో కీలక మార్పులు జరిగాయి. కోచ్ రవిశాస్త్రి దిగిపోయి.. హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ వచ్చాడు. దీంతో విరాట్ కోహ్లీ ఆధిపత్యానికి చెక్ పడింది. కోహ్లీ ఆటలు సాగడం లేదన్న ప్రచారం మొదలైంది. ఇప్పటికే అనిల్ కుంబ్లేతో గొడవకు దిగి అతడిని పంపించేసిన బీసీసీఐ ఇప్పుడు గంగూలీకి దగ్గరైన ద్రావిడ్ ను బయటకు పంపే అవకాశాలు లేవు. ఈ క్రమంలోనే కోహ్లీనే కెప్టెన్సీ నుంచి వైదొలిగారు.తనను తీసివేయకుమందే ముందే తేరుకొని కెప్టెన్సీ వదిలేశాడని తెలుస్తోంది.
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అస్త్రసన్యాసం చేశాడు. ఇక టీమిండియా టెస్ట్ పగ్గాలు కూడా వదిలేసి ఇక ఆటగాడిగానే కొనసాగాలని డిసైడ్ అయ్యాడు. టీ20 ప్రపంచకప్ ముందర పొట్టి క్రికెట్ కెప్టెన్సీని విరాట్ కోహ్లీ వదిలేశాడు. అనంతరం వన్డే కెప్టెన్సీని విరాట్ నుంచి లాగేసుకుంది బీసీసీఐ. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి.. బీసీసీఐ, దాని అధ్యక్షుడి గంగూలీకి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా వైదొలిగి అభిమానులకు షాకిచ్చాడు.
ఇంత సుధీర్ఘ కాలం తనను సారథిగా వ్యవహరించే అవకాశం కల్పించిన బీసీసీఐకి, కెప్టెన్ గా తనను నమ్మి బాధ్యతలు అప్పగించిన ధోనికి కోహ్లీ కృతజ్ఞతలు తెలిపాడు. కోచ్ రవిశాస్త్రితో కలిసి టెస్టుల్లో భారత జట్టును గొప్ప స్థితికి తీసుకెళ్లిన విసయాన్ని విరాట్ గుర్తు చేసుకున్నాడు.
ఇక కెప్టెన్సీ వదులుకున్నాక విరాట్ కోహ్లీ తేలిపోయాడు. ఏమాత్రం రాణించడం లేదు. ఒకప్పుడు పరుగుల యంత్రం అని పిలిపించుకున్న కోహ్లీ ఇప్పుడు ఒక్క సెంచరీ చేయడానికి ఆపసోపాలు పడుతున్నాడు. రెండేళ్లుగా ఒక్క సెంచరీలేక ప్రపంచంలోనే నంబర్ 1 ర్యాంకులో ఉన్న కోహ్లీ ఇప్పుడు దిగజారిపోయాడు.
ఇక ఇదే సమయంలో టీ20లోకి యువ ఆటగాళ్లు దూసుకొస్తున్నారు. వాయువేగంతో పరుగులు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. కోహ్లీని మించి రాణిస్తూ పరుగుల వరద పారిస్తున్నారు. దీంతో వచ్చే టీ20 ప్రపంచకప్ కు విరాట్ కోహ్లీకి గట్టి పోటీ నెలకొంది.
ఇప్పటికే కోహ్లీ సారథ్యంలో యూఏఈలో ఒక కప్ చేజారింది. పైగా పాకిస్తాన్ చేతిలో చిత్తుగా టీమిండియా ఓడిపోయింది. అందుకే ఈసారి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తున్న బీసీసీఐ కఠిన నిర్ణయాల దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. అందుకే ఈసారి విరాట్ కనుక ఇంగ్లండ్ పర్యటనలో రాణించకపోతే ఇక కోహ్లీని ఇంటికి పంపడమే అని బీసీసీఐ సెలక్టర్లు డిసైడ్ అయినట్లు సమాచారం. విరాట్ కు ప్రత్యామ్మాయ ప్లేయర్ కు చోటు కల్పిస్తారని తెలుస్తోంది. సో ఈ ఇంగ్లండ్ పర్యటనే విరాట్ కోహ్లీకి చివరి చాన్స్ అని బీసీసీఐలోని అధికారులు అంటున్నారు. చూడాలి మరీ ఏం జరుగుతుందో..?