Begin typing your search above and press return to search.

రోహిత్ ను తొలిగించి రాహుల్, పంత్ కు అవకాశం ఇవ్వనున్న కోహ్లి?

By:  Tupaki Desk   |   18 Sep 2021 2:30 AM GMT
రోహిత్ ను తొలిగించి రాహుల్, పంత్ కు అవకాశం ఇవ్వనున్న కోహ్లి?
X
టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం క్రీడావర్గాల్లో సంచలనమైంది. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కోహ్లీ ధనాధన్ క్రికెట్ కెప్టెన్సీ పదవికి గుడ్ బై చెప్పబోతున్నాడు. అయితే వన్డేను మినహాయించి కేవలం టీ20ల నుంచే కోహ్లీ తప్పుకోవడం ఆసక్తికరంగా మారింది.

ఐసీసీ మెగా ఈవెంట్లు అయిన చాంపియన్స్ ట్రోఫీ 2017, వన్డే వరల్డ్ కప్ 2019, వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఓడిపోయింది. ఈ మూడు కప్ లు గెలవలేక విఫలమైంది. ఇక ఐపీఎల్ లోనూ కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీ ఇంతవరకు టైటిల్ గెలవలేకపోయింది. దీంతో టీ20 కెప్టెన్సీపై ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కోహ్లీ రిజైన్ తో టీ20 కెప్టెన్ గా ప్రస్తుతం వైస్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మకు ప్రమోషన్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. కోహ్లీకి, రోహిత్ శర్మకు మధ్య విభేధాలు ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు కోహ్లీ టీ20కి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.

వన్డేల్లో వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్, టీ20లలో తన డిప్యూటీగా రిషబ్ పంత్ కు అవకాశం ఇవ్వాలని కోహ్లీ తాజాగా బీసీసీఐని కోరాడన్న టాక్ వినిపిస్తోంది. రోహిత్ శర్మ వయసు 34 ఏళ్లు. దీంతో అతడిని వైస్ కెప్టెన్ పదవి నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ కోహ్లీ సెలక్షన్ కమిటీకి సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగినట్లు సమాచారం.

ఆరునెలల చర్చ తర్వాత కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడని బీసీసీఐ సెక్రటరీ జైషా చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. బీసీసీఐ-కోహ్లి మధ్య విభేదాలున్నాయనే వార్తలకు బలం చేకూరేలా ఉంది.

ఇక యూఏఈలో జరిగే టీ20 వరల్డ్ కప్ లో జట్టు మెరుగైన ప్రదర్శన చేయకపోతే కెప్టెన్సీ పదవి నుంచి తనను తొలగించడం ఖాయమని కోహ్లీకి ముందే తెలుసు. అందుకే తనకు తానుగా ముందే తెలుసుకొని గౌరవప్రదంగా టీ20 కెప్టెన్సీ బాధ్యతలను వదులుకున్నాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే.. కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పుకోవాలని బీసీసీఐ కోరిందని.. కోహ్లీ ఇందుకు ప్రతిగా కేఎల్ రాహుల్, పంత్ లకు అప్పగించేందుకు డిమాండ్ చేశాడని.. రోహిత్ కు ఇవ్వకూడదనే ఇలా చేసినట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.