Begin typing your search above and press return to search.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అర్థం అవుతుందా?
By: Tupaki Desk | 18 March 2021 7:30 AM GMTఒకప్పుడు కాంగ్రెస్ లో కొండలా కనిపించిన కోమటిరెడ్డి బ్రదర్స్.. విడిపోయి.. పార్టీల పరంగా దూరం జరిగి ఇప్పుడు తమ ఉనికికే చేటు తెచ్చుకునేలా పరిస్థితి తయారైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ ఇద్దరిదే హవా.. వైఎస్ఆర్ ను కూడా ఖాతరు చేసేవారు కాదు.. వైఎస్ఆర్ ను ఎదురించి నల్గొండలో తమ పట్టు నిలుపుకునే వారు కోమటిరెడ్డి బ్రదర్స్.
అయితే వైఎస్ఆర్ చనిపోవడం.. రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచాడు. మళ్లీ నల్గొండ జిల్లా రాజకీయాలపై పట్టు నిలుపుకున్నాడు. వాళ్ల తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ లో ఉండలేక.. బీజేపీ వాళ్ల దగ్గరకు పోతే ఎలా ఉంటుందో అర్థంకాక .. కాంగ్రెస్ లోనే ఉంటూ ఆ పార్టీకి వ్యతిరేకంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు.
అయితే కాంగ్రెస్ వాదులు మాత్రం కోమటిరెడ్డి ఉంటే ఉండమను అని.. లేకపోతే వెళ్లిపోమని రాజగోపాల్ రెడ్డికి తెగేసి చెబుతున్నారట.. బీజేపీ పిలుస్తోందని రోజూ ప్రెస్ మీట్లకు చెప్పడం.. లీకులు ఇవ్వడం సరికాదని హితవు పలుకుతున్నారు. జానారెడ్డికి టికెట్ ఇస్తే థర్డ్ ప్లేసు దక్కుతుందని.. టీఆర్ఎస్ ను ఓడించడమే నా లక్ష్యం అంటూ ఇలాంటి స్టేట్ మెంట్లు ఇస్తూ కాంగ్రెస్ లోనే ఉండి బీజేపీకి మద్దతు పలకడం సరికాదంటున్నారు. కావాలనుకుంటే బీజేపీలోకి వెళ్లమను అంటూ స్పష్టం చేస్తున్నారు.
రాజగోపాల్ రెడ్డి స్టేట్ మెంట్స్ కు భయపడి కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ వాళ్లకు ఇస్తారేమో అని చూస్తున్నారని.. ఆ స్టేట్ మెంట్స్ వల్ల అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దక్కాల్సిన పీసీసీ పదవి.. కాంగ్రెస్ లో మంచి భవిష్యత్ దక్కకుండా పోతోందన్న వాదన ఉంది.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ లో మంచి భవిష్యత్ ఉంది. దానిని తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పోగొడుతున్నాడని కాంగ్రెస్ వాదులు అంటున్నారు. ఉంటే ఉండాలి లేకపోతే పోవాలని కాంగ్రెస్ వాదులు డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి ప్రేరేపించే మాటలు.. అతడు చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతనలేదని చెబుతున్నారు. ‘మీకు అర్థం అవుతుందా? ’ అని సినిమా డైలాగులు పేల్చుతున్నారు.. వెంకటరెడ్డి అయినా కాంగ్రెస్ లో రాజకీయ భవిష్యత్.. సిన్సియారిటీ పోగొట్టుకోకుండా ఉండాలి కానీ.. వెళ్లాలనుకుంటే వెళ్లాలని.. అంతేకానీ ఇలా రోజుకో వ్యాఖ్యలు చేస్తూ మంటపుట్టిస్తున్నారని.. ఇది సరికాదని అంటున్నారు.