Begin typing your search above and press return to search.
రాజీనామాకు కుమారస్వామి..!?
By: Tupaki Desk | 11 July 2019 6:33 AM GMTకర్ణాటక సంక్షోభం కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. గురువారం మంత్రివర్గ సమావేశాన్ని సీఎం కుమారస్వామి బెంగళూరులోని విధాన సౌదలో అత్యవసరంగా మధ్యాహ్నం ఏర్పాటు చేశారు. అయితే 14మంది రాజీనామాలతో మెజార్టీ కోల్పోయిన కుమారస్వామి ప్రభుత్వం ఇలా మంత్రివర్గం ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకోవడాన్ని గవర్నర్ అడ్డుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక జరిగితే స్వచ్ఛందంగా రాజీనామా చేసి కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చాలని సీఎం కుమారస్వామి నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వెలువడుతున్నాయి.
మొత్తం మంత్రులు - 14మంది ఎమ్మెల్యేలు రాజీనామాలను సమర్పించారు. అయితే వారి రాజీనామాలు సాంకేతికంగా ఆమోదించలేదు. దీంతో మంత్రులంతా మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఇందులోనే కీలక నిర్ణయాలను కుమారస్వామి తీసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడే కుమారస్వామి వారికి వివరించి రాజీనామా చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి.
తాజాగా కాంగ్రెస్ సీనియర్లు గులాంనబీ - సిద్ధరామయ్య - కేసీ వేణుగోపాల్ - దినేష్ గుండూరావ్ లు సంకీర్ణ ప్రభుత్వ పరిస్థితిపై చర్చించి జేడీఎస్ అధినేతలు దేవెగౌడ - కుమారస్వామిలతో భేటి అయ్యి పరిస్థితి వివరించారు.
అందుకే కుమారస్వామి మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకొని గవర్నర్ జోక్యం చేసుకోకముందే రాజీనామా చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణతో సీఎం కుమారస్వామి ఏం చేస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.