Begin typing your search above and press return to search.
మేయరమ్మ ఎంపీ అవుతారా....?
By: Tupaki Desk | 20 Dec 2022 6:30 AM GMTఆమె అనూహ్యంగా విశాఖ వంటి అతి పెద్ద నగరానికి ఎంపీ అయ్యారు. హైదరాబాద్ కార్పోరేషన్ తరువాత ఎక్కువ వార్డులు ఉన్నది విశాఖ కార్పోరేషన్ కే. పైగా స్మార్ట్ సిటీ. అలాంటి సిటీకి ఆమె ప్రధమ పౌరురాలు అయ్యారు. విశాఖ మేయర్ గా వైసీపీ సీనియర్ లీడర్ వంశీక్రిష్ణ యాదవ్ ని చేస్తామని 2019 ఎన్నికల వేళ పార్టీ హామీ ఇచ్చింది. దాంతో ఆమె ఒక మామూలు కార్పోరేటర్ గా నామినేషన్ వేసి గెలిచారు.
తీరా గెలిచాక ఆమెను మేయర్ గా వైసీపీ పెద్దలు డిక్లేర్ చేశారు. అలా లక్కీ చాన్స్ కొట్టేసిన ఆమె హరి వెంకట కుమారి. పూర్వాశ్రమంలో టీచర్ గా పనిచేసిన ఆమె మేయర్ గా బాగానే పనిచేస్తున్నారు అని మార్కులు సంపాదించారు. ఆమె అన్ని పార్టీలతో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేయడమే కాదు, ప్రజలతో సన్నిహితంగా ఉంటూ ప్రతీ రోజూ వార్డులలోనే తిరుగుతూ మంచి మేయరమ్మగా పేరు తెచ్చుకున్నారు.
విశాఖ సిటీలో ప్లాస్టిక్ నిర్మూలన విషయంలో పట్టుదలగా కృషి చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను అనేకమైనవి ప్రతిపాదించారు. విద్యాధికురాలిగా బీసీ నేతగా ఉన్న ఆమె వైసీపీ అధినాయకత్వం గుడ్ లుక్స్ లో ఉందని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఆమెకు మరింత ఉన్నతమైన పదవిని అందించి ఆమె సేవలను వాడుకోవాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది అని ప్రచారం అయితే సాగుతోంది.
విశాఖ నుంచి వచ్చే ఎన్నికల్లో ఎంపీగా మేయర్ హరి వెంకట కుమారిని నిలబెడితే ఎలా ఉంటుంది అన్న చర్చ అయితే స్టార్ట్ అయింది అని అంటున్నారు. విశాఖలో బలమైన యాదవ సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక బీసీల నుంచి ఎవరూ ఎంపీగా కొన్ని దశాబ్దాల కాలంలో చూస్తే అయిన దాఖలాలు లేవు. ఎంతసేపూ రెడ్డి కమ్మల నుంచే అభ్యర్ధులు వస్తున్నారు. మరీ ముఖ్యంగా గత రెండున్నర దశాబ్దాలుగా కమ్మలే అధిక శాతం గెలిచారు అన్నది రికార్డుల్లో ఉంది.
దీంతో సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా మేయర్ ని ఎంపీ అభ్యర్ధిగా నిలబెడితే బీసీ కార్డుతో పాటు మహిళా కార్డు కూడా కలసి గెలుపు అవకాశాలు మెరుగు అవుతాయని వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నారు అన్న చర్చ అయితే సాగుతోంది. విశాఖలో అత్యధిక శాతం ఉన్న సామాజికవర్గానికి ఆ విధంగా న్యాయం చేశామని చెప్పుకోవడంతో పాటు బీసీలను కూడా అక్కున చేర్చుకుంటే పని సులువు అవుతుంది అని వైసీపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది అని అంటున్నారు.
ఎటూ టీడీపీ తరఫున బిగ్ షాట్ ఉంటారని అంటున్నారు. బీజేపీ నుంచి జీవీఎల్ నరసింహారావు పోటీకి దిగితారు అని చెబుతున్నారు. జేడీ లక్ష్మీనారాయణ కూడా పోటీకి రెడీ అవుతున్నారు. ఇలా అగ్ర వర్ణాల అభ్యర్ధులు పోటీకి దిగే పరిస్థితులు ఉన్న ఈ నేపధ్యంలో పక్కా లోకల్ కార్డుతో పాటు మహిళ బీసీని బరిలోకి దింపితే గణనీయమైన ఫలితాన్ని సొంతం చేసుకోవచ్చు అన్న లెక్కల్లో వైసీపీ ఉంది అని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో ఎంతవరకూ వాస్తవం ఉందో చూడాల్సి ఉంది మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.