Begin typing your search above and press return to search.

సవాలును మంత్రులు స్వీకరిస్తారా ?

By:  Tupaki Desk   |   1 July 2021 5:30 AM GMT
సవాలును మంత్రులు స్వీకరిస్తారా ?
X
జల జగడాలపై ఏపి మంత్రులు విసిరిన చాలెంజ్ కు తెలంగాణా ప్రభుత్వం స్వీకరిస్తుందా ? అనుమానమే అంటున్నారు విశ్లేషకులు. కొద్ది రోజులుగా శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లోని నీటి వినియోగంపై తెలంగాణా-ఏపి ప్రభుత్వాల మధ్య వివాం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. పై ప్రాజెక్టుల నుండి ఏపి ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడేసుకుంటోందంటు తెలంగాణా మంత్రులు నోటికొచ్చినట్లు తిట్టేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇదే సమయంలో తమ వాటాకు మించి ఒక్క గ్లాసు నీళ్ళు కూడా తమ ప్రభుత్వం వాడుకోవటం లేదని ఏపి మంత్రులు స్పష్టం చేస్తున్నారు. పైగా జల దోపిడికి తెలంగాణానే తెరలేపిందంటు ఎదురుదాడులు చేస్తున్నారు. పనిలో పనిగా తెలంగాణా మంత్రులకు ఏపి మంత్రులు చాలెంజ్ విసిరారు. అదేమిటంటే ఏ ప్రాజెక్టు నుండి ఎవరెంత నీటిని వాడుకున్నారు ? ఏ అవసరాల కోసం వాడుకున్నారు ? అనే విషయమై చర్చకు తాము సిద్ధమంటు సవాలు విసిరారు.

అనవసరంగా ఎదుటివాళ్ళపై నోరుపారేసుకునే బదులు కూర్చుని రికార్డుల ఆధారంగా చర్చలు జరుపుకోవటమన్నది అందరికీ మంచిదే. మంత్రులుగా ఎవరైనా నోరుపారేసుకోవచ్చు. నోటికొచ్చిన అబద్ధాలు కూడా చెప్పచ్చు. అయితే రికార్డులు అబద్ధాలు చెప్పవు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రాజెక్టుల నుండి వాడుకుంటున్న ప్రతి నీటిచుక్కు కూడా రికార్డవుతోంది.

ప్రాజెక్టుల నుండి ఏ ప్రభుత్వం ఎంత నీటిని వాడుకున్నది ? ఏ రోజు, ఏ సమయంలో వాడుకున్నారనే విషయం డిజిటల్ గా రికార్డయిపోతుంది. వ్యవసాయానికి వాడుకున్న నీరెంత ? విద్యుత్ ఉత్పత్తికి వాడిన నీరెంత ? అన్న విషయం రికార్డుల ద్వారా చర్చల్లో తేలిపోతుంది. అందుకనే ఏపి మంత్రులు తెలంగాణా మంత్రులకు చాలెంజ్ విసిరారు. మరి ఏపి మంత్రుల చాలెంజ్ కు తెలంగాణా మంత్రులు స్పందిస్తారా ? డౌటే.