Begin typing your search above and press return to search.
మరోసారి దేశ ప్రజల ముందుకు మోడీ రానున్నారా?
By: Tupaki Desk | 28 April 2021 4:22 AM GMTమిగిలిన ప్రధానమంత్రులకు పూర్తి భిన్నం నరేంద్ర మోడీ తీరు. ఊహించని విధంగా ఆయన నిర్ణయాలు ఉంటాయి. తమ పదవీ కాలంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించే రికార్డు మోడీదే. అయితే ఆగస్టు 15.. లేదంటే జనవరి 26 లాంటి సందర్భాల్లో.. చాలా చాలా ప్రత్యేక సందర్భాల్లో తప్పించి దేశ ప్రజలను ఉద్దేశించి సందేశాన్ని ఇచ్చే ప్రధానిగా మోడీ రికార్డు చెరగలేనిది. గతంలో మరే ప్రధాని కూడా ఇన్నిసార్లు మాట్లాడింది లేదు. అంతేకాదు.. కేవలం గంట.. రెండు గంటల ముందు దేశాన్ని ఉద్దేశించి మోడీ మాట్లాడతారంటూ ఉత్కంటను పెంచేసి.. అనూహ్య నిర్ణయాల్ని ప్రకటించే మోడీ.. త్వరలో కీలక నిర్ణయాన్ని మాత్రం తన తీరుకు భిన్నంగా వెల్లడించబోతున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.
క్యాలెండర్ లో రోజు కరిగిపోతే చాలు.. దేశం ముందుకు మూడున్నర లక్షల మందికి పైనే కరోనా పాజిటివ్ కేసులు అధికారికంగా నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో దాచేస్తున్న పాజిటివ్ కేసుల్ని కలుపుకుంటే.. రోజుకు నాలుగు లక్షల కేసులు నమోదు అవుతున్నా ఆశ్చర్యం లేదనే చెప్పాలి. ఇంతలా వైరస్ విస్తరిస్తున్న వేళ.. చెక్ పెట్టేందుకు లాక్ డౌన్ కు మించిన తరుణోపాయం లేదు.
ఓవైపు లాక్ డౌన్.. మరోవైపు వ్యాక్సినేషన్.. ఇంకోవైపు పెద్ద ఎత్తున టెస్టుల్ని చేయటం ద్వారా.. కరోనా కోరల్ని పీకేసే అవకాశం ఉంది. ఇందులో మొదటిది లాక్ డౌన్ విధించేందుకు కేంద్రం ఇప్పటివరకు సిద్ధంగా లేనప్పటికీ.. మే 2 తర్వాత ఇందుకుసంబంధించిన ప్రకటన వెలువడే వీలుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై పెద్ద ఎత్తున ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీర్ఘకాలికంగా కాకున్నా.. కనీసం ఒక పదిహేను రోజులైనా సరే.. లాక్ డౌన్ విధిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇటీవల జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంలో.. కరోనాకు ఏం చర్యలు తీసుకోవటానికైనా తాను సిద్ధమేనని.. లాక్ డౌన్ అన్నది ఆఖరి ఛాయిస్ కావాలన్న మాట ఆయన నోటి నుంచి వచ్చింది. అత్యున్నత న్యాయస్థానం నుంచి వివిధ రాష్ట్రాల హైకోర్టుల వరకు.. కోవిడ్ విషయంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలపై అసంత్రప్తిని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితిని యథాతధంగా కొనసాగితే.. కేసుల తీవ్రత భారీగా పెరగటం ఖాయమన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ విధించేందుకు నాలుగు రాష్ట్రాలు.. ఒక కేంద్రపాలిత ప్రాంతంలో నిర్వహిస్తున్న ఎన్నికలే ప్రధాన అడ్డంకిగా మారనున్నాయి. మే 2న ఎన్నికల ఫలితాలు వెల్లడి కావటం.. ఆ వెంటనే లాక్ డౌన్ దిశగా నిర్ణయం తీసుకునే వీలుందని చెబుతున్నారు. అయితే.. ఇప్పటివరకు ఫాలో అయిన పద్దతిలో కాకుండా.. ఈసారి లాక్ డౌన్ ను దేశ ప్రజల ముందుకు వచ్చి తన నిర్ణయాన్ని ప్రధాని మోడీ ప్రకటించరన్న మాట వినిపిస్తోంది. ఇటీవల జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ప్రసంగంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. ప్రజల ఆగ్రహాన్ని పరిగణలోకి తీసుకొని.. కోవిడ్ కలకలాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చే వరకు ప్రజల ముందుకు వచ్చే సాహసం చేయరన్న మాట వినిపిస్తోంది.