Begin typing your search above and press return to search.

షోకాజ్ ను ఎంపీ లెక్కచేస్తారా ?

By:  Tupaki Desk   |   24 Oct 2022 4:43 AM GMT
షోకాజ్ ను ఎంపీ లెక్కచేస్తారా ?
X
ఏదో ఇవ్వాలి కాబట్టి ఎంపీకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు ఇచ్చినట్లుంది. తాము షోకాజ్ నోటీసు ఇచ్చినా దానికి ఎంపీ సమాధానం ఇస్తారనే ఆశలైతే అధిష్టానంలో ఉన్నట్లు లేదు. ఎందుకంటే అవసరమైతే తాను రిటైర్ అయిపోతానని చెప్పిమరీ కాంగ్రెస్ ను డ్యామేజింగా మాట్లాడిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుండి అధిష్టానం మాత్రం ఏమి సమాధానం ఆశిస్తుంది ?

మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో సొంతపార్టీ అభ్యర్ధి పాల్వాయిస్రవంతి ఓటమికి ఎంపీ పరోక్షంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం బయటపడింది. తమ మద్దతుదారులతో ఫోన్లో మాట్లాడుతు తనతమ్ముడు, బీజేపీఅభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలుపుకు సహకరించాలని ఎంపీ అడుగుతున్నారు. ఈ విషయం లీకవ్వటంతో అధిష్టానం ఎంపీకి షోకాజ్ నోటీసిచ్చింది. షోకాజ్ నోటీసుకు ఎంపీ సమాధానం ఇస్తారని కూడా ఎవరు అనుకోవటంలేదు.

ఎందుకంటే అవసరమైతే రాజకీయాల నుండి రిటైరవుతానని ఎంపీ అన్న డైలాగులు అందరు విన్నదే. అయితే ఎంపీకి రిటైరయ్యే ఉద్దేశ్యంలేదు. మునుగోడు ఉపఎన్నికల రిజల్టు చూసుకుని అప్పుడు ఏమిచేయాలో నిర్ణయించుకుంటారు.

మునుగోడులో బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న తమ్ముడు గెలిస్తే ఎంపీ కూడా కమలంపార్టీలో చేరిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ తమ్ముడు ఓడిపోతే ఏమిచేయాలో అప్పుడే నిర్ణయించుకుంటారు.

ఒకవేళ రాజకీయాల్లో కంటిన్యు అవదలచుకుంటే షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చే విషయాన్ని అప్పుడు ఆలోచిస్తారు. లేదంటే బీజేపీలో చేరినా చేరిపోవచ్చు కూడా. ఉపఎన్నికలో బీజేపీ ఓడిపోయినా జనరల్ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎంపీ అనుకుంటే బీజేపీలో వెళ్ళే ఛాన్స్ ఉందనే అనుకోవాలి. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది అనుమానమే.

ఇపుడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిచినా రేపటి జనరల్ ఎలక్షన్స్ లో గెలుస్తుందని గ్యారెంటీలేదు. కాబట్టి తమ వ్యాపారాలు సజావుగా సాగాలంటే తాను కూడా బీజేపీలోకి వెళ్ళటమే బెటర్ అని ఆలోచిస్తుండచ్చు. ఏదేమైనా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఎంపీ తిరిగొచ్చిన తర్వాత కానీ ఈ విషయంలో క్లారిటిరాదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.