Begin typing your search above and press return to search.

మునుగోడు ఎఫెక్ట్ ఏపీపైనా ప‌డుతుందా...!

By:  Tupaki Desk   |   2 Nov 2022 5:29 AM GMT
మునుగోడు ఎఫెక్ట్ ఏపీపైనా ప‌డుతుందా...!
X
ఏపీ రాజ‌కీయాల‌కు - ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని మునుగోడు ఉప ఎన్నిక‌ల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న రాజ‌కీయ యుద్ధానికి ఏమైనా సంబంధం ఉందా? ఏపీలో ఇది రిఫ్లెక్ట్ అవుతుందా? అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. అక్క‌డ ఒకే ఒక్క ఉప ఎన్నిక సార్వత్రిక స‌మ‌రాన్ని మించిపోయిన త‌ర‌హాలో సాగుతోంది.

అధికార పార్టీకి ప్ర‌తిప‌క్షాలు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు అంత బ‌లం లేని పార్టీ బీజేపీ ఇప్పుడు దూకుడు చూపిస్తోంది. ఇక‌, కాంగ్రెస్ కూడా దూకుడుగానే ఉంది. ఏపీ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌దాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ కూడా ఈ దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌నే చ‌ర్చ సాగుతోంది.

అయితే..ఇప్పుడు ఏపీలో ప‌రిస్థితి కొంత మేర‌కు తిర‌గ‌బ‌డింది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అక్క‌డ తెలంగాణ‌లో కాంగ్రెస్ మాదిరిగా సైలెంట్ అయిపోయింది. అదేస‌మ‌యంలో ఏమీ లేని.. జ‌న‌సేన మాత్రం దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. తెలంగాణ‌లో కూడా ఒకే ఒక్క ఎమ్మెల్యేతో ఉన్న బీజేపీ పుంజుకుంది. ఎంపీలు ఉన్నా.. ఆ విష‌యం ప‌క్క‌న పెడితే.. ఎమ్మెల్యే మాత్రం ఒక్క‌రే ఉన్న బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతోంది. అదేవిధంగా జ‌న‌సేన కూడా దూకుడుప్ర‌ద‌ర్శిస్తోంది.

అయితే.. ఏపీలో ఈ రెండు పార్టీల ప‌రిస్థితి నిక్క‌చ్చిగా తేలాలంటే.. ఏదో ఒక ఉప ఎన్నికో లేదా.. మ‌రో ఎన్నికో రావాల్సి ఉంది. అయితే.. దీనికి సీఎం జ‌గ‌నే అడ్డు ప‌డుతున్నార‌నేది క‌ళ్ల‌ముందు క‌నిపిస్తున్న వాస్త‌వం. ఎందుకంటే.. నిశితంగా గ‌మ‌నిస్తున్న ప‌రిస్థితులు.. జ‌గ‌న్ నిర్ణ‌యం వెనుక ఉన్నాయ‌నేది ప‌రిశీల‌కుల మాట‌. తెలంగాణ‌లో ప‌రిస్తితిని తీసుకుంటే.. మూడు చోట్ల ఉప ఎన్నిక‌లు వ‌స్తే.. రెండు చోట్ల అధికార పార్టీ ఓడిపోయి బీజేపీ గెలిచింది.

ఇలాంటి ప‌రిస్తితి ఏపీలోనూ ఉంద‌నేది జగ‌న్ ఆలోచ‌న‌గా ఉంద‌ని చెబుతున్నారు. అందుకే ఆయ‌న ఇటీవ‌ల ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ రాజీనామా చేసిన‌ప్పుడు కూడా దానిని డ‌మ్మీగా మార్చేశారు. అదేవిధంగా మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు రాజీనామా చేస్తాన‌ని చెప్పిన‌ప్పుడు కూడా వ‌ద్ద‌న్నారు.

దీనికి కార‌ణం ప‌రోక్షంలో ఉన్న జ‌న‌సేన ప్ర‌త్యక్ష బ‌లం పుంజుకోవ‌డ‌మే. రాజ‌కీయంగా దూకుడు పెంచ‌డ‌మే.. ఈ కార‌ణంగానే వైసీపీ వెనుక‌డుగు వేస్తోంది. మొత్తంగా చూస్తే.. చాలా విష‌యాల్లో మునుగోడు పోరు మాదిరిగానే ఏపీలోనూ రాజ‌కీయాలు మారుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.