Begin typing your search above and press return to search.
పశ్చిమ గోదావరి జిల్లాకు `అల్లూరి` పేరు:జగన్
By: Tupaki Desk | 26 May 2018 8:23 AM GMTవైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోన్నసంగతి తెలిసిందే. గోదావరి ప్రజలు జననేత జగన్ కు అడుగడుగున నీరాజనాలు పలుకుతున్నారు. దివంగత నేత వైఎస్ వారసుడి అడుగులో అడుగు వేస్తూ ఆయన వెంట నడుస్తున్నారు. తమ కోసం తరలి వచ్చిన యువనేతకు గోడు వెళ్లబోసుకుంటున్నారు. పర్యటించిన ప్రతి జిల్లాలో ప్రజాసమస్యలను ఏదో మొక్కుబడిగా తెలుసుకున్నామన్న రీతిలో కాకుండా జగన్....స్వయంగా క్షేత్రస్థాయిలో వారి ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. జిల్లా వారీగా ప్రధాన సమస్యల సమాచారం సేకరించి ఊరుకోకుండా...స్వయంగా ప్రజల వృత్తులలో పరకాయ ప్రవేశం చేసి వారి కష్టాలను అవగతం చేసుకుంటున్నారు. ఆయా ప్రాంత ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారిస్తానని హామీలిస్తున్నారు. తాజాగా, పెదకాపవరం గ్రామ శివారులో పర్యటించిన జగన్ రొయ్యల చెరువును సందర్శించి స్వయంగా వాటికి మేత వేయడం అందుకు నిదర్శనం. ఓ రొయ్యల చెరువును సందర్శించిన జగన్....చేపలు, రొయ్యలకు స్వయంగా మేత వేసి వారిలో ఒకడిగా కలిసిపోయారు. జననేత తమలో ఒకడిగా కలిసిపోయి...వల వేసి చేపలు, రొయ్యలు పట్టడం ఎలాగో అడిగి తెలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేవు.
రొయ్యలు, చేపల ధరలు పడిపోతున్నాయని జగన్ కు వారు విన్నవించారు. టీడీపీ నేతల అనుయాయులైన వ్యాపారులు సిండికేట్ కావడం వల్ల అన్యాయం జరుగుతోందన్నారు. తన హయాంలో కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తానని, గిట్టుబాటు ధర వచ్చేవరకు వాటిరి కోల్డ్ స్టోరేజ్ లో దాచుకోవచ్చని జగన్ భరోసా ఇచ్చారు. అంతేకాకుండా, ఆక్వా రైతులకు విద్యుత్తు చార్జీలు 4.75 పైసలు నుండి 1.50 పైసలు వరకు తగ్గిస్తామని హామీ ఇచ్చారు.ఆకివీడులో జరిగిన బహిరంగ సభలో జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెల్లదొరల తూటాలకు ఎదురొడ్డి నిలిచిన మన్నెం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును పశ్చిమ గోదావరి జిల్లాకు పెడతానని జగన్ ప్రకటించారు. ఈ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నియోజకవర్గంలో తాగునీరు కలుషితమైందని - రక్షిత నీటి కోసం నెలకు రూ.600 నుంచి రూ.700 ఖర్చుపెట్టాల్సి వస్తోందని ప్రజలు వాపోయారు. చెరుకురసంలా ఉన్న నీటిని చూసిన జగన్ చలించిపోయారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ ప్రారంభించిన 30 కోట్ల విలువైన పైపులైన్ పనులు టీడీపీ హయాంలో ఆగిపోయాయని ప్రజలు జగన్ కు చెప్పారు. కనీసం తాగునీరు అందించలేకపోతోన్న ప్రభుత్వంపై మండిపడ్డారు. పట్టకపోవడంపై జగనన్న మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఇంటింటికి సురక్షిత తాగునీరు అందిస్తామన్నారు. పేదలకు సెంటు భూమి ఇవ్వని ప్రభుత్వం ఉండి ఎమ్మెల్యేకు ఏలూరు పక్కన 350 ఎకరాల భూమిని కారుచౌకగా కేటాయించడం పై జగన్ మండిపడ్డారు. ఆకివీడులో చెరువులను పూడ్చి మల్టిప్లెక్స్ లు కట్టాలని చూస్తోన్న ఎమ్మెల్యే తీరుపై జగన్ నిప్పులు చెరిగారు.