Begin typing your search above and press return to search.

లోకేష్ పాద‌యాత్ర.. త‌మ్ముళ్ల‌ను క‌లిపినా.. త‌న్నుకోవ‌డం ఆపేనా..?

By:  Tupaki Desk   |   12 Nov 2022 12:30 PM GMT
లోకేష్ పాద‌యాత్ర.. త‌మ్ముళ్ల‌ను క‌లిపినా.. త‌న్నుకోవ‌డం ఆపేనా..?
X
టీడీపీ యువ నాయ‌కుడు.. నారా లోకేష్ జ‌న‌వ‌రి 27వ తేదీ నుంచి పాద‌యాత్ర ప్రారంబిస్తున్నారు. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ దాదాపు ఖ‌రారైంద‌నే స‌మాచారం ఉంది. కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌న త‌ల్లి భువ‌నేశ్వ‌రి.. వీర‌తిల‌కం దిద్ద‌గా.. లోకేష్ పాద‌యాత్ర ఘ‌నంగా ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని గ్రామాల‌ను క‌లుపుతూ.. ఈ పాద‌యాత్ర‌ను ప్లాన్ చేసుకున్నారు. పార్టీని బ‌లోపేతం చేయ‌డం దీనిలో ప్ర‌ధాన ల‌క్ష్యంగా ఉంది.

అదేస‌మ‌యంలో వైసీపీ వ్య‌తిరేక విధానాల‌ను మ‌రింత లోతుగా ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం.. గ‌త ప్ర‌భుత్వ తాలూకు ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కుచెప్పి.. వైసీపీ ప్ర‌భుత్వం వాటిని ఎలా తొలగించిందో చెప్పేందుకు ఈ పాద‌యాత్ర‌ను వినియోగించుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో గ్రామ‌స్థాయిలో చెదిరిపోయిన ఓటు బ్యాంకును తిరిగి సొంతం చేసుకునేందుకు కూడా.. నారా లోకేష్ ఈ యాత్ర‌ను సానుకూలంగా మ‌లుచుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది.

అంతేకాదు.. పాద‌యాత్ర ద్వారా.. రాష్ట్రంలోని సుమారు స‌గం నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న త‌మ్ముళ్ల మ‌ధ్య విభేదాలు.. వివాదాల‌ను కూడా ప‌రిష్క‌రించాల‌ని.. లోకేష్ భావిస్తున్నారు.

త‌మ్ముళ్ల‌ను చైత‌న్యం చేయ‌డం.. పార్టీ కార్య‌క్ర‌మాల్లో వారిని భాగ‌స్వాముల‌ను చేయ‌డం.. లోకేష్‌కు ఇప్పుడు కీల‌క ల‌క్ష్యంగా ఉంది. అదేస‌మ‌యంలో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితిని అంచ‌నా వేసి.. అక్క‌డ తీసుకునే చ‌ర్య‌ల‌పై కూడా ఆయ‌న దిశానిర్దేశం చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

అయితే, ఇంత చేసినా.. నారా లోకేష్‌కు ఒక పెద్ద స‌మ‌స్య మాత్రం వెంటాడుతూనే ఉంది. అది త‌మ్ముళ్ల త‌గువులు. పైకి అంద‌రూ బాగానే ఉన్నార‌ని క‌నిపిస్తున్నా.. అంత‌ర్గ‌తంగా మాత్రం త‌మ్ముళ్లు.. రగిలిపోతు న్నారు. ఆధిప‌త్య పోరు.. టికెట్ ర‌గ‌డ తారా స్థాయిలో ఉంది.

ఇలాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో నారా లోకేష్ వారిని ఎలా బుజ్జ‌గిస్తారు? ఏవిధంగా లైన్‌లో పెట్టి మ‌న‌సులు క‌లుపుతారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు ఎన్ని వ్యూహాలు ప‌న్నినా.. ఇది మాత్రం సాధించ‌లేక పోయారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో లోకేష్ అనుస‌రించే వ్యూహానికి ప్రాధాన్యం ఏర్ప‌డింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.