Begin typing your search above and press return to search.
పసుపు-కుంకుమ పథకం పనిచేయలేదు.. మరి నవరత్నాలు పనిచేస్తాయా?
By: Tupaki Desk | 19 Aug 2021 11:30 AM GMTఔను! ఏపీలో గత ఇరవై ఏళ్లలో సంక్షేమ పథకాలు పెట్టి.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి.. మళ్లీ ఆ అప్పుల ను ప్రజల మీద పెడుతున్నాయి.. ప్రభుత్వాలు.. మరి ఇది ఎంత వరకు సమంజసం? ఇది ప్రభుత్వాల తీరుకు.. వారి ఆలోచనలకు కరెక్ట్ విధానమేనా? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్టోరీపై ఒక లుక్ వేద్దాం!
టీడీపీ హయాంను తీసుకుంటే.. ఆత్మగౌరవ నినాదంతో పార్టీ పెట్టిన అన్నగారు ఎన్టీఆర్.. రూ.2కే పేదలకు కిలో బియ్యం పథకం ప్రకటించారు. ఇది బాగానే వర్కవుట్ అయినప్పటికీ.. ఆయన ఓటమిని చవి చూడా ల్సి వచ్చింది. ఇక, తర్వాత కాలంలో కాంగ్రెస్ నాయకుడు, ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరె డ్డి అధి కారంలోకి వచ్చిన తర్వాత కిలో బియ్యాన్ని రూపాయి 90 పైసలకే ఇచ్చారు. అయినప్పటికీ.. ప్రజలు ఆ పార్టీని తర్వాత ఎన్నికల్లో గెలిపించకపోవడం గమనార్హం. అంటే.. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది.
ఇక, ఈ క్రమంలో మరోసారి అధికారం చేపట్టిన.. టీడీపీ విషయాన్ని తీసుకుంటే.. చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు మధ్య రేగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బాబు.. అధికారం చేపట్టారు. అయితే.. అనంతర కాలంలో 1999లో వచ్చిన ఎన్నికల్లో .. బీజేపీతో పొత్తు పెట్టుకుని.. వాజ్‌పేయి ఇమేజ్‌తో చంద్రబాబు విజయం దక్కించుకున్నారు. ఇక, 2004 ఎన్నికల విషయానికి వచ్చేస రికి తనపై జరిగిన అలిపిరి మావోయిస్టు ఘట నను అడ్డు పెట్టుకుని సానుభూతి ఓట్లు సంపాయించాలని అనుకున్నారు. అయితే.. అది సక్సెస్ కాలేదు.
ఇక, ఆ ఎన్నికల్లో వైఎస్ దూకుడు, ఆయన పాదయాత్ర ఎఫెక్ట్ కలిసి వచ్చి.. టీడీపీ ఘోరంగా దెబ్బతింది. ఇక, కాంగ్రెస్ వరుసగా విజయం దక్కించుకున్న తర్వాత.. సంక్షేమ పథకాలను జోరుగా అమలు చేశారు. అయితే.. 2009లో ఎన్నికలకు వచ్చే సరికి మాత్రం ఆ పథకాలు పనిచేయలేదు. ఏదో గెలిచామంటే గెలి చాం అన్నట్టుగా వైఎస్ విజయం దక్కించుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇదే విషయాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా అసెంబ్లీలో పేర్కొన్నారు కూడా. అసలు పీఆర్‌పీ, లోక్‌సత్తా లేకపోతే.. వైఎస్ కూడా ఓడిపోయేవారు అని విశ్లేషకులు అప్పట్లోనే చెప్పారు.
అంటే.. దీనిని బట్టి.. వైఎస్ ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా.. కూడా పనిచేయలేదనే వాదన వచ్చింది. దీనిని బట్టి.. సంక్షేమ పథకాలు పనిచేయలేదని స్పష్టమైంది. వైఎస్ చనిపోయిన తర్వాత.. కిరణ్ కుమార్‌రెడ్డి కూడా వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాలను కొనసాగించడంతోపాటు.. మరికొన్ని పథకాలను జోడించి అమలు చేశారు. అయినప్పటికీ.. రాష్ట్రం విభజన తర్వాత.. అటు తెలంగాణలోను, ఇటు ఏపీలోనూ.. కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పటి వరకు పార్టీ కోలుకోలేదు. ఆ తర్వాత ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది.
నవ్యాంధ్రలో చంద్రబాబు కూడా అనేక పథకాలు.. కానుకలు ప్రవేశ పెట్టి అమలు చేశారు. నేరుగా ప్రజలకు డబ్బులు ఇచ్చే పసుపు-కుంకుమ వంటి పథకాలను కూడా అమలు చేశారు. ఒక్కొ క్క అర్హులైన మహిళకు రూ.10 వేల చొప్పున వారి అకౌంట్లలోవేశారు. అదేసమయంలో డ్వాక్రాద్వారా.. 20 వేల రూపాయల చొప్పున వేశారు. ఇలా కోటి మందికి ఇచ్చారు. అయినప్పటికీ.. ఎన్నికలకు వచ్చే సరికి మాత్రం.. కనీసం 10 శాతం ఓట్లు కూడా పోల్ కాలేదు.
ఇక, 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ.. అధికారంలోకి వచ్చిన జగన్.. 151 సీట్లలో విజయం దక్కించు కుని భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జగన్ కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. ప్రజలకు సామాజిక వర్గాల వారీగా.. పథకాలను అమలు చేస్తున్నారు. డబ్బులు నేరుగా ఇస్తున్నారు. అయితే.. ఇక్కడ కూడా ప్రస్తావనకు వస్తున్న విషయం ఏంటంటే.. ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు.. ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా.. అధికారంలోకి రాలేక పోయాయి. ఇప్పుడు జగన్ అమలు చేస్తున్న పథకాలు కూడా ఆయనకు గ్యారెంటీగా అధికారం తెచ్చిపెడతాయనే గ్యారెంటీ లేదని అంటున్నారు పరిశీలకులు.
కేవలం కార్యకర్తలు, అభివృద్ధి మీద దృష్టి పెడితేనే.. ప్రజలు పట్టం కడతారని అంటున్నారు. పార్టీకి కార్యకర్తలు ఎంత ముఖ్యమో.. అభివృద్ది కూడా అంతే ముఖ్యం. ప్రజలు ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలమీద.. ఆధారపడకుండా.. ఉద్యోగాలు సృష్టించడం.. పేద వర్గాలకు.. సామాజిక వర్గాల వారీగా కాకుండా.. అందరికీ న్యాయం జరిగేలా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు. అంటే.. దీనిని బట్టి.. అభివృద్ది చేసే ప్రభుత్వాలకు మనుగడ ఉంటుందని.. కేవలం సంక్షేమాన్ని నమ్ముకుంటే కష్టమని అంటున్నారు పరిశీలకులు.
మనవి:
ఈ ఆర్టికల్‌పై మీ అభిప్రాయాలు తప్పకుండా క్రింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చెయ్యండి .. వీటిని ఆర్టికల్స్ రూపంలో తీసుకువస్తామని.. ప్రభుత్వానికి చేరవేస్తామని.. మనవి చేస్తున్నాం.