Begin typing your search above and press return to search.
మీ నిధులేం మాకు అవసరం లేదు
By: Tupaki Desk | 5 Feb 2019 6:12 AM GMTమొండివాడు రాజుకంటే బలవంతుడు. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయ్యింది కూడా. ఇక ప్రధాని మోదీ చాలా మొండివాడు. తాను అనుుకున్నదే చేస్తాడు. ఈ ఐదేళ్లలో ఏ విషయంలో మోదీ కాంప్రమైజ్ అవ్వడం ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు. ఎందుకంటే మోదీకి ఇప్పటివరకు సరైన ప్రత్యర్థి దొరకలేదు. ఇప్పుడు దొరికింది. ఆమే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కేంద్ర వైఖరికి నిరసనగా రెండు రోజులుగా దీదీ దీక్ష చేస్తున్నారు. ఎంతమంది చెప్పినా - ఎంత ప్రయత్నించినా.. ఆమె మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. ఆదివారం రాత్రి నుంచి ధర్నా చేస్తున్న దీదీ.. సోమవారం ఉదయం అధికారిక విధులు అక్కడ నుంచే నిర్వహించారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మంత్రివర్గ సమావేశం కూడా దర్నా ప్రాంతం నుంచే నిర్వహించారు. చిట్ ఫండ్ కుంభకోణంలో కోల్ కతా కమిషనర్ రాజీవ్ కుమార్ ని ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ఆదివారం సాయంత్రం వచ్చారు. దీంతో.. వారందర్ని ఒక గదిలో నిర్భందించారు కోల్ కతా పోలీసులు. సీబీఐ చర్యలు - కేంద్ర వ్యవహార శైలికి నిరసనగా ఆదివారం సాయంత్రం నుంచి దీక్ష చేపట్టారు మమతా బెనర్జీ.
మమతా బెనర్జీ చేస్తున్న దీక్షకు ఇతర పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే.. మమతా బెనర్జీకి ప్రత్యక్షంగా మద్దతు తెలపాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇక డీఎంకే నేత స్టాలిన్ - ఇతర పార్టీ నాయకులు కూడా మమతా బెనర్జకి మద్దతు తెలిపారు. కేంద్రంలో నియంతృత్వ పాలన నడుస్తుందని.. చూస్తుంటే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకువస్తున్నాయని అన్నారు మాదీ ప్రదాని దేవెగౌడ. మరోవైపు.. రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని.. అందుకే కేంద్రం ఇచ్చే నిధుల్ని కూడా ఇకనుంచి తీసుకోమని మమతా బెనర్జీ ప్రకటించారు. సమాఖ్య వ్యవస్థకు మోదీ తూట్లు పోడుస్తున్నారని ఆరోపించారు. మొత్తానికి మహిళ అయినా కూడా మోదీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది మమతా బెనర్జీ.