Begin typing your search above and press return to search.
భారత్ ఉత్పత్తులపై పాకిస్థాన్ నిషేధం ఎత్తేస్తోందా?
By: Tupaki Desk | 31 Aug 2022 7:50 AM GMTఅనూహ్యంగా ముంచుకు వచ్చిన వర్షాలు, వరదలతో పాకిస్థాన్ బెంబేలెత్తుతున్న సంగతి తెలిసిందే. వరదలో ఆ దేశంలో సగం భూభాగం మునిగింది. 20 లక్షల ఎకరాల్లో ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. 1200 మందికి పైగా మరణించారు. వీరిలో వందల సంఖ్యలో చిన్నారులు ఉన్నారని తెలుస్తోంది. 3.30 కోట్ల మంది తమ ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మారారు. దీంతో వీరిని ఆదుకోవడానికి తక్షణం 16 కోట్ల డాలర్లు కావాలని పాకిస్థాన్ ఐక్యరాజ్యసమితిని అర్థించింది. పూర్తి స్థాయిలో నష్టాన్ని భర్తీ చేయాలంటే 1000 కోట్ల డాలర్లు కావాలని పాకిస్థాన్ చెబుతోంది.
వర్షాలు, వరదలతో దేశంలో సగం భూభాగం చిక్కుకోవడంతో పంటలు నీటమునిగాయి. దీంతో ఆయా ఆహార ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటిదాకా ఆర్థిక వ్యవస్థ పతనంలో శ్రీలంకలోనే దారుణ పరిస్థితులను అందరూ చూడగా.. ఇప్పుడు పాకిస్థాన్ వంతు వచ్చింది. భారత్‌లోని పంజాబ్ నుంచి సమీప నగరం అయిన లాహోర్ నగరంలో టమోటా కిలో రూ.500, ఉల్లిపాయలు కిలో రూ.400 పలుకుతున్నాయి. ఒక్క లాహోర్ మాత్రమే కాకుండా ఇస్లామాబాద్ తో సహా అనేక పెద్ద నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. కొన్ని చోట్ల కిలో టమోటాలు రూ.700 పలుకుతున్నాయి. ప్రజలు ఆకలితో అష్టకష్టాలు పడుతున్నారు.
వరదల కారణంగా పంటలు నష్టపోవటం, డిమాండ్ కు తగినట్లుగా సరఫరా లేకపోవటం వల్ల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్, సింధ్, దక్షిణ పంజాబ్‌ల్లో వరదల వల్ల రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరుగుతాయని సమాచారం. నిత్యావసరాల్లో ఒకటైన బంగాళదుంపల ధరలు కూడా కిలో రూ.40 నుంచి రూ.120కి పెరిగాయని వార్తలు వచ్చాయి.
ఇప్పటికే పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కూడా పతనం అంచున ఉంది. సౌదీ అరేబియా, తదితర దేశాలు ఇస్లామిక్ దేశాల ఆర్థిక సాయంతోనే పాకిస్థాన్ నెట్టుకువస్తోంది. ఇప్పుడు పులి మీద పుట్రలా వరదలు, వర్షాలు విజృంభించడంతో పాకిస్థాన్ బెంబేలెత్తుతోంది. ఇప్పుడు భారత్ ఆపన్న హస్తం కోసం చూస్తోంది. భారత్ కూడా ఇలాంటి కష్ట సమయంలో శత్రు భావన చూపకుండా చేతనైన సాయం చేయడానికి ముందుకొచ్చింది. ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులను పెద్ద మొత్తంలో పంపుతోంది. వాఘా సరిహద్దు గుండా ఇప్పటికే వాహనాలు బయలుదేరి వెళ్లాయి.
కాగా 2019లో జమ్మూకశ్మీర్ స్వయంప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేయడంతో భారత్ దిగుమతులపైన పాకిస్థాన్ నిషేధం విధించింది. అయితే ఇప్పుడు వరదలతో ఆ దేశంలో సగం భూభాగం నీట మునగడంతో ఆహార పదార్థాల కొరతను దృష్టిలో ఉంచుకొని భారత్ నుంచి కూరగాయలు, ఇతర ఆహార వస్తువుల దిగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ చెబుతున్నారు.
అది కూడా పన్నులు లేకుండా దిగుమతులకు అనుమతులు ఇస్తామన్నారు. ఆకాశ మార్గాలు, సముద్ర మార్గాలు కాకుండా భూ సరిహద్దుల గుండా దిగుమతులకు అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ ప్రతిపాదనపై వాణిజ్య, ఆర్థిక కార్యదర్శులతో చర్చలు జరిపామని పాక్ ఆర్థిక మంత్రి ఇస్మాయిల్ తెలిపారు. ఈ ప్రతిపాదనను ప్రధాన మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలిపారు.
రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను బాగు చేసేందుకు తాజా పాక్ సంక్షోభం ఒక అవకాశాన్ని ఇస్తోందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే, పాక్ క్యాబినెట్ దీనికి ఆమోదం తెలుపుతుందా? లేదా భారత్ ఎలా స్పందిస్తుంది? లాంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు దాడి జరిపి 24 మంది సీఆర్పీపీఎప్ జవాన్లను బలిగొన్నాక భారత్ కూడా పాకిస్థాన్‌కు దిగుమతులను నిలిపివేసింది. ఆ దేశానికి ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను కూడా ఉపసంహరించుకుంది.
ఇమ్రాన్ ఖాన్ తర్వాత ప్రధాన మంత్రిగా షాబాజ్ షరీఫ్ బాధ్యతలు తీసుకున్నాక భారత్‌తో సంబంధాలను మళ్లీ పునరుద్ధరిస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక వాణిజ్య అధికారిని కూడా నియమించారు. మరోవైపు షాబాజ్ ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించాలని పిలుపునిస్తున్నారు. ఇది రెండు దేశాలకు ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతున్నారు.
అయితే, ఈ వ్యవహారంపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో షాబాజ్ ప్రభుత్వం భయపడింది. ఢిల్లీలో వాణిజ్య అధికారి నియామకంలో ప్రత్యేకత ఏమీలేదని, ఇది సాధారణ ప్రక్రియేనని వెల్లడించింది. మరోవైపు భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పునరుద్ధరిస్తారనే వార్తలు కూడా అసత్యమని అప్పట్లో తెలిపింది.
అయితే ఇప్పుడు వరదలతో పాకిస్థాన్లో పరిస్థితి అల్లకల్లోలంగా మారడం, ఆకలి చావులు తలెత్తుతుండటంతో భారత్ వైపు చూడక తప్పని పరిస్థితి పాకిస్థాన్‌కు ఏర్పడిందని అంటున్నారు.
కాగా 2019కు ముందు రెండు దేశాల మధ్య తాజా పళ్లు, కూరగాయలు, బట్టలు, చేనేత ఉత్పత్తులు, జిప్సమ్, మార్బుల్, మసాలా దినుసులు తదితర వస్తువులు వాఘా సరిహద్దుల గుండా ఎగుమతులు, దిగుమతులు జరిగేవి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.