Begin typing your search above and press return to search.

ప్రగతిభవన్ కి పవన్ వస్తారా... కేసీయార్ ప్లాన్ ఏంటి...?

By:  Tupaki Desk   |   11 Oct 2022 2:30 AM GMT
ప్రగతిభవన్ కి పవన్ వస్తారా... కేసీయార్ ప్లాన్ ఏంటి...?
X
ఏపీలో కూడా తన పార్టీని విస్తరించాలని టోటల్ గా జాతీయ పార్టీగా చేసి ఢంకా భజాయించాలని కేసీయార్ ఆలోచిస్తున్నారు. ఆయన పార్టీకి ఏపీలో ఒక కీలకమైన ఆప్షన్ గా పవన్ కళ్యాణ్ జనసేన ఉంది అంటున్నారు. ఏపీలో వైసీపీ ఎటూ పొత్తు పెట్టుకోదు, టీడీపీతో కేసీయారే వద్దు అనుకుంటారు. ఇక మిగిలింది పవన్ జనసేన మాత్రమే. అయితే పవన్ కళ్యాణ్ కి కేసీయార్ బీయారెస్ పార్టీ మీద ఉన్న అభిప్రాయం ఏంటి అంటే ఇంకా ఆయన బయటపడలేదు.

బీయారెస్ విషయంలో టీడీపీ వైసీపీ రియాక్ట్ అయ్యాయి. కానీ జనసేన మాత్రం అసలు ఆ విషయంతో తమకు ఏమీ సంబంధం లేనట్లుగానే ఉంది. అయితే పవన్ కేసీయార్ విషయంలో చాలా సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారని ఇప్పటిదాకా ఆయన చేసిన కొన్ని ప్రకటనలు, యాక్షన్ బట్టి అంటున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వేళ, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పవన్ కేసీయార్ కి మద్దతు ప్రకటించారు. అలాగే కేసీయార్ మంది పాలనాదక్షుడు అని కూడా అనేక సార్లు పొగిడారు.

ఈ నేపధ్యంలోనే కేసీయార్ కూడా పవన్ తనకు మిత్రుడు అని భావిస్తున్నారని అంటున్నారు. మంచి ముహూర్తం చూసి మరీ కేసీయార్ పవన్ని ప్రగతిభవన్ కి ఆహ్వానించి చర్చలు జరుపుతారు అని అంటున్నారు. ఏపీలో బీయారెస్ తో జనసేన పొత్తు కలిపే విధంగా చర్చలు జరిపేందుకు పవన్ని పిలుస్తారు అని అంటున్నారు. అయితే పవన్ కేసీయార్ తో కలసి ఏపీలో పొత్తుకు అంగీకరిస్తారా అన్నదే చూడాలని అంటున్నారు.

ఏపీలో చూస్తే పవన్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. అలాగే ఆయన టీడీపీతో పొత్తులకు వెళ్లాలని ఆశిస్తున్నారు ఇపుడు సడెన్ గా కేసీయార్ ఎంట్రీ ఇచ్చి పొత్తులు అంటే పవన్ ఏం చేస్తారు అన్నదే చర్చగా ఉంది. పవన్ కనుక కేసీయార్ తో జత కలిస్తే బీజేపీ వెంటనే కటీఫ్ చేసుకుంటుంది అని అంటున్నారు.

బీజేపీకి కేసీయార్ బద్ధ విరోధి అన్నది తెలిసిందే. ఇక టీడీపీతో కలసి పవన్ పొత్తు అంటే కేసీయార్ అసలు ఒప్పుకోరు. ఏ విధంగా చూసినా పవన్ కి ఇది ఇరాకాటమే అంటున్నారు. అంతే కాదు రాజకీయంగా కూడా ఆయన దక్షతకు వ్యూహాలకు కూడా పరీక్ష అంటున్నారు. చూడాలి మరి పవన్ ఏం చేస్తారో. ఆయన ఆలోచనలు ఏంటో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.