Begin typing your search above and press return to search.
టీడీపీకి పవన్ మళ్లీ దెబ్బేస్తాడా ?
By: Tupaki Desk | 21 Jun 2021 3:30 PM GMTఏపీలో జరిగిన 2019 ఎన్నికల్లో తొలిసారి జనసేన బరిలో దిగి ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పార్టీ అధినేత హోదాలో పవన్ కళ్యాణ్ కూడా రెండుచోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సొంత జిల్లాలోని భీమవరంతో పాటు విశాఖ జిల్లాలోని గాజువాకలో పవన్ చిత్తుగా ఓడిపోయారు. ఇక జనసేన తరుపున ఒకే ఒక ఎమ్మెల్యే రాజోలులో రాపాక వరప్రసాదరావు గెలిచారు. అలా గెలిచిన ఎమ్మెల్యే కూడా ఇప్పుడు వైసీపీ చెంత చేరిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయాక పవన్ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు ఏం చేస్తున్నాడని ప్రశ్నించుకుంటే ఆన్సర్లు లేవు. పవన్ ఎంచక్కా హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నాడు.
2014 ఎన్నికల్లో పవన్ తమ టీడీపీ కొంప కొల్లేరు చేసేశారు. పవన్ బలంగా ఓట్లు చీల్చిన నియోజకవర్గాల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. మరికొన్ని చోట్ల మూడో స్థానానికి కూడా పడిపోయింది. గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాతో పాటు కృష్ణా, గుంటూరులో జనసేన బలంగా ఉన్న చోట్ల టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పశ్చిమలో నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు లాంటి చోట్ల జనసేన టీడీపీకి గట్టి దెబ్బ కొట్టింది. ఇక కృష్ణా జిల్లాలో పెడన, మచిలీపట్నం, అవనిగడ్డలో టీడీపీ ఓడిపోవడానికి జనసేనకు వచ్చిన ఓట్లే కారణం.
ఇక వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు సక్సెస్ అయితేనే తాము వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని కూడా టీడీపీ నేతలు పార్టీ అధిష్టానానికి సైతం నివేదికలు పంపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన - టీడీపీ కొన్ని చోట్ల పొత్తులు పెట్టుకుని వైసీపీకి చెక్ పెట్టాయి. గోదావరి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువుగా కనపడింది. అందుకే ఇప్పుడు స్థానిక టీడీపీ నేతలు కూడా జనసేనతో పొత్తు ఉండాలనే కోరుతున్నారు. అయితే ప్రస్తుతం బీజేపీతో జట్టు కట్టిన పవన్ వచ్చే ఎన్నికల్లో అదే పార్టీతో కలిసి ముందుకు వెళితే టీడీపీకి తిప్పలు తప్పవు.
ఇంకా చెప్పాలంటే టీడీపీ తరపున పోటీ చేసేందుకు కూడా చాలా చోట్ల క్యాండెట్స్ ముందుకు రారు. ఒకవేళ పవన్ టీడీపీతో జట్టు కట్టేందుకు సిద్ధమైతే అప్పుడు సమీకరణలు మారడంతో పాటు టీడీపీలో జోష్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి.