Begin typing your search above and press return to search.
తెలంగాణ సెంటిమెంట్ ను పవన్ కించపరిచారా?
By: Tupaki Desk | 5 Aug 2019 10:14 AM GMTచెబుతున్న వ్యాఖ్యలపై ఇప్పుడు వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ పలువురు నిప్పులు చెరుగుతున్నారు. మరికొందరు హైదరాబాద్ లోని జనసేన కార్యాలయం వద్ద నిరసనలు నిర్వహిస్తున్నారు. దీనిపై పవన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు.. జరుగుతున్న ప్రచారానికి అస్సలు సంబంధం లేదని చెప్పటమే కాదు.. ఈ తీరు ఏ మాత్రం సరికాదంటున్నారు.
తెలంగాణ ఉద్యమం తాగుడుతో ముడిపడి ఉందన్నట్లుగా పవన్ వ్యాఖ్యలు చేశారని.. తెలంగాణ ఉద్యమకారుల్ని గిరిజనుల్ని కించపరిచేలా పవన్ ఒక సభలో మాట్లాడినట్లుగా ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పవన్ రియాక్ట్ కావాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. తనపై జరుగుతున్న దుష్ప్పచారంపై పవన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాను అనని మాటల్ని అన్నట్లుగా ప్రచారం చేయటాన్ని ఆయన తప్పు పట్టారు. తాను అన్నదేమిటి? ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏమిటి? అది కూడా తాను వ్యాఖ్యలు చేసి వారం అవుతున్న వేళ.. ఇప్పుడు వివాదం తెర మీదకు రావటంలో అర్థం ఉందా? అని లాజిక్ బయటకు తీస్తున్నారు. తెలంగాణ ఉద్యమం తాగుడుతో ముడిపడి ఉందని పవన్ అన్నట్లుగా చెబుతున్న మాటల్లో వాస్తవం అస్సలు లేదంటున్నారు.
తాను అనని మాటల్ని అన్నట్లుగా ప్రచారం జరుగుతుందన్నారు. తాజాగా ఆయన ఈ వ్యవహారంపై క్లారిటీ ఇవ్వటం గమనార్హం. భీమవరంలో తాను పార్టీ నేతలు.. కార్యకర్తలతో సమావేశమైనప్పుడు ప్రస్తావనకు వచ్చిన అంశాలపై తాను స్పందించిన దానికి భిన్నమైన సమాచారం ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై పవన్ రియాక్ట్ అయ్యారు.
తాను తెలంగాణ గురించి ఐదు రోజుల క్రితం మాట్లాడితే.. ఇప్పుడు కించపరుస్తూ మాట్లాడినట్లుగా అభివర్ణించటాన్ని తప్పు పట్టారు. తాను మాట్లాడింది వేరని.. ఇప్పుడు చెబుతున్న వారు చెబుతోంది వేరన్నారు. భీమవరంలో తాను ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ హైలెట్ కాకుండా ఉండేందుకు కొందరు ఆడిన నాటకంగా ఆయన అభివర్ణించారు. తాను జగన్ చెప్పిన మద్యపాన నిషేధానికి సంబంధించిందని.. దాన్ని ట్విస్ట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
మద్యపానం అనేది కొన్ని గిరిజన తెగల్లో.. కొన్ని రాష్ట్రాల కల్చర్ లో భాగంగా ఇమిడిపోయి ఉంటుందని.. ప్రజల నుంచి సంస్కృతిని వేరు చేయలేం కాబట్టి మద్యపాన నిషేధం కష్టమవుతుందని మాత్రమే అన్నట్లగా చెప్పారు. అందుకే.. మద్యపాన నిషేధం వర్క్ వుట్ కాలేదన్నారు. తాను అన్న మాటలు తన సొంతం కావని.. పుచ్చలపల్లి సుందరయ్యా రాసిన తెలంగాణ సాయుధ పోరాటం అనే పుస్తకంలో చదివిన మాటల్ని ఆయన ప్రస్తావించారు. తాను మాట్లాడిన మాటలకు భిన్నమైన వ్యాఖ్యల్ని తాను అన్నట్లుగా అపాదిస్తున్నట్లుగా ఫైర్ అయ్యారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యునిస్టులు సైతం మద్యాపాన నిషేధం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. గిరిజనులు ఇప్పపువ్వు నుంచి నాటుసారా తీస్తారని.. అది వారి సంస్కృతిలో భాగమన్నారు. తాను చెప్పిన మాటలకు భిన్నంగా ప్రచారం జరగటమే కాదు.. ఇళ్ల మీదకు వస్తాం.. ఆఫీసుల మీదకు వస్తామని అంటే తాను చూస్తూ ఊరుకోనన్నారు. అలా చేస్తే తాట తీస్తానన్న పవన్.. తాను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలని అడుగుతానని చెప్పారు. తన చిన్న పిల్లలు ఉన్న ఇంటి ముందుకు వచ్చి ధర్నాలు.. నిరసనలు అంటే ఒప్పుకోనని స్పష్టం చేశారు. తాను అన్న మాటల మీద ఏదైనా తప్పుగా ఉంటే భీమవరం వచ్చి రాజకీయాలు చేయొచ్చని.. అతేకాదు.. చిన్నపిల్లలున్న తన ఇంటి ముందుకు వెళ్లి నిరసనలంటే మాత్రం ఒప్పుకునేది లేదన్నారు. మరి.. పవన్ తాజా క్లారిటీపై నిరసనకారులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.