Begin typing your search above and press return to search.

గోల్డెన్ చాన్స్... పవన్ అందుకుంటారా...?

By:  Tupaki Desk   |   10 Nov 2022 5:30 PM GMT
గోల్డెన్ చాన్స్... పవన్ అందుకుంటారా...?
X
జనసేన ఒక కొత్త పార్టీ. అధికారం రుచి చూడని పార్టీ. అవినీతి మకిలి అంటని పార్టీ. ఆ పార్టీ ఏమి చెప్పినా జనాలకు ఫ్రెష్ గా ఉంటుంది. వారు రిసీవ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే రాజకీయంగా దూసుకుపోవడానికి జనలా అవసరాలు గుర్తించి వారికి తగిన న్యాయం చేయడానికి కీలకమైన హామీలను ఇవ్వడం కొన్ని ముఖ్యమైన అంశాలను పట్టుకుని జనంలో పెట్టి పోరాటాలు చేయడం కూడా జనసేన చేయవచ్చు.

అలా కనుక చేస్తే అది సమాజంలోకి మరింత ఎక్కువగా వెళ్ళి పార్టీ విస్తృతికి బాగా దోహదపడుతుంది. ఇపుడు అలాంటి ఒక కీలకమైన టాపికి ఉంది. అదే అగ్ర వర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్లు. ఇది ఎంతో ప్రాధాన్యత కలిగిన విషయం. కేంద్రం 2019లో దీని మీద చట్టం చేస్తే కొందరు కోర్టుకు వెళ్లారు. సుప్రీం కోర్టు కూడా ఇది న్యాయబద్ధం, రాజ్యాంగబద్ధం అని కచ్చితమైన తీర్పు ఇచ్చింది.

దాంతో దీనికి ఉన్న ఇబ్బందుకు అన్నీ తొలగిపోయాయి. ఇపుడు ఈ ఇష్యూని పట్టుకుని కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు దీని నుంచి చేస్తామని పవన్ ప్రకటించడం వల్ల ఆయా వర్గాల ఓట్లను గుత్తమొత్తంగా సాధించుకునే వీలు ఉంటుంది అని అంటున్నారు కాపులకు రిజర్వేషన్లు కావాలి. వారి ఆకాంక్షను నాటి చంద్రబాబు సర్కార్ తీర్చలేకపోయింది. కాపులను బీసీలలో కలిపే ప్రతిపాదనను సరిగ్గా చేయలేకపోయింది.

అయితే దానికి పరిహారంగా చంద్రబాబు ఆనాడు కేంద్రంలోని మోడీ సర్కార్ తెచ్చిన ఈబీసీ రిజర్వేషన్లను ఉపయోగించుకున్నారు. అందులో కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ మేరకు జీవో ఇచ్చారు. అయితే వైసీపీ వచ్చాక మాత్రం దాన్ని పక్కన పెట్టేశారు. ఇక సుప్రీంకోర్టులో అడ్డంకులు అన్నీ తొలగినా జగన్ సర్కార్ ఆ రిజర్వేషన్ల విషయంలో ఏమీ మాట్లాడంలేదు.

సరిగ్గా ఈ అవకాశాన్ని వాడుకుని పవన్ కనుక ఈబీసీ రిజర్వేషన్లలో కాపులకు అయిదు శాతం ఇవ్వాలని ప్రభుత్వం మీద పోరాటం చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఒక వేళ దీనికి వైసీపీ సర్కార్ సుముఖంగా లేకఒపతే తాను అధికారంలోకి వచ్చాక చేస్తామని హామీ ఇవ్వడం వల్ల కూడా ఫలితాలు మంచిగా వస్తాయని అంటున్నారు.

కానీ ఎందుకో తీర్పు వచ్చి మూడు నాలుగు రోజులు అయినా జనసేన ఈ విషయంలో సైలెంట్ గానే ఉంది. మరి ఇంతటి గోల్డెన్ చాన్స్ ని వినియోగించుకోవడానికి జనసేన ఎందుకు ఆలోచిస్తోంది అన్నదే చాలా మందికి కలుగుతున్న సందేహం. మరి ఏం జరుగుతుందో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.