Begin typing your search above and press return to search.
బీజేపీతో రజినీ దోస్తీ.. ఎంట్రీ ఖాయమా?
By: Tupaki Desk | 5 March 2020 5:30 PM GMTతమిళనాడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న రజినీకాంత్ తాజాగా డేరింగ్ స్టెప్ వేశారు. హఠాత్తుగా రజినీ మక్కళ్ మండ్రం (ఆర్ఎంఎం) కు చెందిన జిల్లా స్థాయి కార్యకర్తలతో భేటి అయ్యారు. ఈ భేటితో రజినీ కాంత్ రాజకీయ ఎంట్రీ ఖాయమన్న చర్చ మొదలైంది.
తమిళనాడు ఎన్నికలకు ఇంకా ఏడాది సమయమే ఉంది. ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు ఆయన జిల్లా స్తాయి తన సంఘం నేతలతో చెన్నైలో సమావేశం కావడం తమిళనాట పొలిటికల్ హీట్ పెంచింది. పొలిటికల్ ఎంట్రీపై క్షేత్రస్థాయిలో పరిస్థితులను రజినీకాంత్ ఆరాతీసినట్టు తెలిసింది.
ఇక అనంతరం విలేకరులతో మాట్లాడిన రజినీకాంత్ మీడియా కు పెద్దగా బ్రేకింగ్ విషయాలు చెప్పలేదు. తాను కార్యకర్తలతో నిర్వహించిన సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఉసూరుమనిపించారు. కొన్ని విషయాలను తెలుసుకోవడానికి మాత్రమే తాను భేటి అయ్యానని తెలిపారు. సమయం వచ్చినప్పుడు వివరాలు చెప్తానన్నారు.
కాగా రజినీకాంత్ రాబోయే ఎన్నికల్లో బీజేపీతో దోస్తీ కట్టి ఆ పార్టీ అండదండలతో తమిళనాడు ఎన్నికల్లో పోటీచేస్తారని ఊహాగానాలు వెల్లువెత్తాయి. దీనిపై మాత్రం రజినీ మౌనం వహించారు.