Begin typing your search above and press return to search.

మ్యాగ‌జైన్ల ప్ర‌చుర‌ణ‌ను నిలిపివేయ‌నున్న రామోజీ?

By:  Tupaki Desk   |   4 Nov 2017 5:54 PM GMT
మ్యాగ‌జైన్ల ప్ర‌చుర‌ణ‌ను నిలిపివేయ‌నున్న రామోజీ?
X
మీడియా మొఘ‌ల్ రామోజీ రావు గురించి హైద‌రాబాద్‌లోని మీడియా స‌ర్కిళ్ల‌లో కీల‌క చ‌ర్చ జ‌రుగుతోంది. త‌న ప్ర‌చుర‌ణ సంస్థ‌ల ద్వారా ప‌బ్లిష్ చేసే మేగ‌జైన్ల‌కు రామోజీ మంగ‌ళం పాడ‌నున్నార‌ట‌. తెలుగు న‌వ‌ల‌ల‌ను ప్ర‌చురించే చ‌తుర‌, ఆస‌క్తిక‌ర‌మైన తెలుగు క‌థ‌ల‌కు వేదిక‌గా ఉండే విపుల‌, తెలుగు సినీరంగంలో ప్ర‌ముఖ మేగ‌జైన్‌గా పేరొందిన సితారను సైతం ప్ర‌చుర‌ణ నిలిపివేయించ‌నున్నార‌ట‌.

వివిద వ‌ర్గాల్లో సాగుతున్న చ‌ర్చ‌ల స‌మాచారం ప్ర‌కారం ఈ మేగ‌జీన్ల‌ను పూర్తిగా నిలిపివేయ‌రు. కేవ‌లం వాటి ముద్ర‌ణ మాత్ర‌మే ఆపివేసి...డిజిట‌ల్ ఎడిష‌న్‌ను కొన‌సాగించ‌నున్నారు. మేగ‌జైన్ల‌ ప్ర‌చుర‌ణ రంగం తీవ్రంగా ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న క్ర‌మంలో డిజిట‌ల్ వైపు మ‌ర‌లాలని రామోజీరావు భావించిన‌ట్లు స‌మాచారం. తాను ప్రారంభించిన వాటిని మూసివేయ‌డం రామోజీకి స‌హ‌జంగా ఇష్టం ఉండ‌ద‌ని చెప్తుంటారు. అయితే స‌రైన ఫ‌లితాలు రాని నేప‌థ్యంలో...ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు. అయితే లాభాలు రాక‌పోతే...మూసివేత‌కే నిర్ణ‌యం తీసుకుంటార‌ని గ‌త ఉదంతాల‌ను ప్ర‌స్తావిస్తున్నారు. ఇంగ్లిష్ ప‌త్రిక‌ను ప్రారంభించి... అది పాఠ‌కుల మ‌న్న‌న‌ల‌ను పొంద‌ని నేప‌థ్యంలో మూసి వేయ‌డం, సోమ పేరుతో సాఫ్ట్ డ్రింక్‌ల విష‌యంలోనూ ఇదే నిర్ణ‌యాన్ని తీసుకున్న సంద‌ర్భాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. ప్ర‌జ‌లు బాటిల్డ్ వాట‌ర్‌కు అల‌వాటు కాని స‌మ‌యంలో ప్ర‌వేశ‌పెట్టిన ఈ ప్ర‌యోగం అప్ప‌ట్లో ఫ‌లితాల‌ను ఇవ్వ‌లేద‌ని గుర్తు చేస్తున్నారు. అదే రీతిలో ప్ర‌జ‌ల ఆలోచ‌న తీరుకు భిన్నంగా ప్ర‌స్తుత మేగ‌జైన్ల ప్ర‌చుర‌ణ తీరు ఉన్నందున‌....ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు.

గ‌తంలో ఇండియాటుడే మేగ‌జైన్ సైతం ఇదే త‌ర‌హా నిర్ణ‌యం తీసుకున్న ఉదంతాన్ని ఉద‌హ‌రిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా ఉధృతి పెరుగ‌డం, డిజిట‌ల్ మీడియా ప‌రంప‌రలో స్వాతి, న‌వ్య వంటి మ్యాగ‌జైన్లు, జ్యోతిచిత్ర‌, శివ‌రంజ‌ని వంటి సినిమా సంబంధిత మ్యాగ‌జైన్లు సైతం త‌మ ప్ర‌చుర‌ణ‌ను నిలిపివేసిన తీరును ప్ర‌స్తావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రామోజీరావు సైతం ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం