Begin typing your search above and press return to search.
రవిప్రకాశ్ మరీ ఇంత చిల్లర పని కూడా చేస్తారా?
By: Tupaki Desk | 18 Oct 2019 7:38 AM GMTకొంతమంది మీద కొన్ని అంచనాలు ఉంటాయి. మనిషన్న తర్వాత అందరికి నచ్చాలన్న రూల్ ఉండదు కదా. ఈ కారణంతోనే మిత్రులతో పాటు శత్రువులు ఉంటారు. కాకుంటే ఏది ఎక్కువ? ఏది తక్కువ? అన్నది మాత్రం సదరు వ్యక్తి తీరును బట్టి ఉంటుంది. ప్రముఖ మీడియా ఛానల్ సీఈవోగా సుదీర్ఘ కాలం సాగటంతో పాటు.. సంచనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. ఆరోపణల మరకలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వకుండా సాగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా అందరికి దూరం కావటం మామూలే. ఇప్పుడు రవిప్రకాశ్ పరిస్థితి అలాంటిదే.
తాను పెంచి పెద్దది చేసిన సంస్థను వేరే వారు కొనటాన్ని సహించలేకపోవటం చూస్తేనే రవిప్రకాశ్ మైండ్ సెట్ మరీ ఇంత కురచా? అన్న డౌట్ రాక మానదు. ఒక కంపెనీలో పని చేసే ఉద్యోగి అంతకంతకూ పెరిగి పెద్ద స్థానంలోకి వచ్చాక.. ఆ క్రెడిట్ అంతా తనదేనని.. తాను ఆ కంపెనీకి అధిపతి కావాలనుకోవటం ఎంత అత్యాశో.. టీవీ9 చానల్ విషయంలో రవిప్రకాశ్ వ్యవహారం కూడా అలాంటిదే.
కావాలనుకుంటే తనకున్న శక్తి సామర్థ్యాలతో అలాంటిదే మరో చానల్ పెట్టుకుంటే ఇబ్బందే ఉండేది కాదు. ఈగోకు పోకుండా ఉంటే సింఫుల్ గా తేలిపోయే విషయాన్ని అనవసరమైన చికాకుల్ని తెచ్చిపెట్టుకున్నారంటూ రవిప్రకాశ్ గురించి కొందరి నోట వచ్చే మాట వినిపిస్తూ ఉంటుంది.
అలాంటి మాటలు నిజమే సుమి అన్న విషయం తాజాగా తెర మీదకు వస్తున్న ఉదంతాల్ని చూస్తే అర్థంకాక మానదు. ఒక కేసులో టీవీ9 సంస్థను నిర్వహించిన ఐల్యాబ్స్ గ్రూపును ఓడించాలన్న ఉద్దేశంతో రవిప్రకాశ్ అదే సంస్థలో పని చేస్తున్న నటరాజన్ పేరుతో నకిలీ మొయిల్ ఐడిని క్రియేట్ చేసి సమాచారాన్ని సైఫ్ పార్టనర్స్ కు పంపినట్లుగా సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.
ఈ చిల్లర చేష్ట గురించి ఐల్యాబ్స్ గ్రూపు అధ్యక్షుడు టి.కృష్ణ ప్రసాద్ మే 6న సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో.. రవిప్రకాశ్ మీద ఐపీసీ 406.. 66డీ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సాంకేతికత సాయంతో రవిప్రకాశ్ చేసిన తప్పునకు సంబంధించిన ఆధారాల్ని సేకరించినట్లుగా చెబుతున్నారు. టీవీ9 ఆఫీసులోని రవిప్రకాశ్ ఛాంబర్ లోని కంప్యూటర్ ద్వారా ఇదంతా జరిగినట్లుగా గుర్తించారు. నిత్యం నీతులు చెప్పే రవిప్రకాశ్ ఇలాంటి చిల్లర చేష్ట చేయటమా? అని అవాక్కు అవుతున్న పరిస్థితి.