Begin typing your search above and press return to search.
హుజూర్ నగర్ ప్రచారంలోకి రేవంత్ దిగనున్నారా?
By: Tupaki Desk | 4 Oct 2019 5:34 AM GMTతెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసే అవకాశం హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం మీద చాలానే ఉందన్న మాటకు ప్రాధాన్యత అంతకంతకూ పెరుగుతోంది. కేసీఆర్ సర్కారు దూకుడుకు కళ్లెం వేసి.. ఆత్మరక్షణలో పడేసేందుకు హుజూర్ నగర్ ఉప ఎన్నికకు మించిన అవకాశం మరొకటి లేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. అయితే.. ఏం చేసైనా ఈ ఎన్నికల్లో గెలవాలన్న కాంక్ష టీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. ప్రచారంలో కళ తప్పిన భావన కాంగ్రెస్ వర్గాల్లో అంతకంతకూ పెరుగుతోంది. టికెట్ పంచాయితీతో మొన్నటివరకూ మహా ఉత్సాహాన్ని ప్రదర్శించిన రేవంత్.. తాజాగా మాత్రం కామ్ గా ఉంటున్నారు. ఉత్తమ్ సతీమణికి టికెట్ ఇవ్వొద్దని చెబుతూ.. చామల కిరణ్ కు టికెట్ ఇవ్వాలని కోరటం.. ఆయన మాటకు భిన్నంగా పార్టీ అధినాయకత్వం ఉత్తమ్ సతీమణినే ప్రకటించటంతో రేవంత్ కినుకు వహించినట్లుగా చెబుతున్నారు.
ఉత్తమ్ సతీమణి పద్మావతి బరిలోకి దిగిన నాటి నుంచి ఉప ఎన్నిక అంశాల్లో దూరంగా ఉంటున్న కారణంగా ఆ లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. తాజాగా చోటుచేసుకున్న పరిణామంతో పరిస్థితుల్లో మార్పు రావొచ్చని చెబుతున్నారు. ఉత్తమ్ సతీమణి పద్మావతి.. తాజాగా రేవంత్ ను హైదరాబాద్ లోని ఆయ నివాసంలో భేటీ అయినట్లుగా తెలుస్తోంది.
తన తరఫున ప్రచారంలో పాల్గొనాలని ఆమె చేసిన వినతికి రేవంత్ సానుకూలంగా రియాక్ట్ అయ్యారని చెబుతున్నారు. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం ప్రచార చివర్లో రేవంత్ రంగ ప్రవేశం చేస్తారని.. దూకుడు ప్రసంగాలతో హుజూర్ నగర్ నియోజకవర్గం మొత్తాన్ని చుట్టుముట్టేస్తారని చెబుతున్నారు. వాడి వేడి ప్రసంగాలతో.. సూటి విమర్శలతో ప్రజల్ని ఆకట్టుకునే సత్తా ఉన్న రేవంత్ ప్రభావం ఎన్నికల ఫలితాల మీద ఎంతన్న విషయం తేలాలంటే కొంతకాలం ఆగాల్సిందే.