Begin typing your search above and press return to search.
రిషికి బ్రిటన్ ప్రధాని అయ్యే చాన్సు మిస్ అయితే.. అందుకు భార్యే కారణమా?
By: Tupaki Desk | 8 July 2022 3:23 AM GMTబ్రిటన్ ప్రధానిగా వ్యవహరిస్తున్న బోరిస్ జాన్సన్.. తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆయన స్థానంలో తదుపరి బ్రిటన్ ప్రధానిగా పగ్గాలు అందుకునే వారు ఎవరన్న జాబితాలో భారత మూలాలు ఉన్న రిషి సునాక్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరికొందరు రేసులో ఉన్నా.. రిషికే ఎక్కువ అవకాశాలు ఎక్కువన్న మాట వినిపిస్తోంది. అయితే.. రిషికి బ్రిటన్ ప్రధాని అయ్యే అవకాశం మిస్ అయితే.. అందుకు కారణం ఆయన సతీమణి కమ్ ఇన్ఫోసిన్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తినే కారణం అవుతారన్న మాట వినిపిస్తోంది.
ఎందుకిలా? కారణం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. 'పన్ను ఎగవేత' ఆరోపణలే కారణంగా చెబుతారు. ఇంతకీ అసలీ వివాదం ఎందుకు వచ్చింది? విలువలతో కూడిన వ్యాపారం చేస్తారంటూ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తిపై ఉండే పేరు ప్రఖ్యాతులకు భిన్నంగా అక్షతా మూర్తిపై విమర్శలు.. ఆరోపణలు ఎలా? అన్నది చూస్తే.. ఆమెకున్న భారత పౌరసత్వమే దీనికి కారణంగా చెప్పాలి.
బ్రిటన్ లో నివసిస్తున్న ఆమె ఇప్పటికి నాన్ డొమిసైల్ హోదాలోనే ఉంటున్నారు. ఇదే ఆమెకు పలు ఇబ్బందుల్ని తెచ్చి పెడుతున్నాయి. వేరే దేశంలో స్థిర నివాసం (పౌరసత్వం) ఉన్న వారిని బ్రిటన్ లో నాన్ డొమిసైల్ పన్ను హోదా ఇస్తారు. ఈ హోదా పొందిన వారు తాము సంపాదించే సంపాదనకు పన్నును బ్రిటన్ లో కట్టే అవసరం ఉండదు. ఈ హోదాను అడ్డు పెట్టుకొని అక్షత పన్నును ఎగవేస్తున్నట్లుగా ఆమెపై ఉన్న ప్రధాన ఆరోపణ.
అయితే.. తాము చట్టప్రకారం బ్రిటన్ లో చేస్తున్న వ్యాపారాలకు పన్ను చెల్లిస్తున్నట్లుగా తన మీద జరుగుతున్న ప్రచారానికి బదులిచ్చారు. అయితే.. ఇది విమర్శలకు తావివ్వటంతో నాన్ డొమిసైల్ పన్ను హోదా చట్టబద్ధమేనని స్పష్టం చేశారు. అంతేకాదు.. విదేశాల్లో పొందిన సంపాదనపై పన్ను మినయింపు నిబంధనను ఇక నుంచి ప్రయోజనం పొందనని పేర్కొన్నారు. తన భర్తకు వచ్చే పదవులకు తన మీద వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆమె ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే.. పదవులు వచ్చి.. వాటికి ఇబ్బందులు ఎదురైన సమయంలో కానీ స్పందించని ఆమె తీరు రుషికి ఇబ్బందికరంగా మారొచ్చన్న మాట వినిపిస్తోంది.
రిషితో పాటు ప్రధాని పదవికి పోటీ పడుతున్న వారిలో వాణిజ్య మంత్రి పెన్నీ మార్డాంట్ కూడా ఉన్నవారు. వీరితో పాటు రక్షణ మంత్రి బెన్ వాలెస్.. విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్.. మాజీ ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్.. ఆర్థిక మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన నదీమ్ జహావీ తదితర పేర్లు ఉన్నాయి.
బోరిస్ జాన్సన్ కు అత్యంత నమ్మకస్తుడిగా.. విశ్వాసపాత్రుడిగా వ్యవహరించిన రిషి సునాక్.. ఇటీవల తన మంత్రి పదవికి రాజీనామా చేయటం.. ఆ తర్వాత పలువురు మంత్రులు రాజీనామాలు చేయటంతో.. బోరిస్ జాన్సన్ తన ప్రధాని పదవికి రాజీనామా చేయటానికి ఓకే చెప్పేయటం తెలిసిందే. సో.. రుషికి బ్రిటన్ ప్రధానిగా అవకాశం మిస్ అయ్యిందంటే.. దానికి ప్రధాన కారణాల్లో ఆయన సతీమణే అవుతారన్న మాట వినిపిస్తోంది.