Begin typing your search above and press return to search.

విల్ స్మిత్ పై 10 ఏళ్లు నిషేధం..స్మిత్ రియాక్ష‌న్ ఇలా!

By:  Tupaki Desk   |   9 April 2022 4:54 AM GMT
విల్ స్మిత్ పై 10 ఏళ్లు నిషేధం..స్మిత్ రియాక్ష‌న్ ఇలా!
X
94వ ఆస్కార్ వేడుక‌ల్లో హోస్ట్ చేసిన‌ క్రిస్ రాక్ ని హాలీవుడ్ న‌టుడు విల్ స్మిత్ వేదిక‌పై చెంప చెళ్లు మ‌నిపించిన ఘ‌ట‌న ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. విల్ స్మిత్ భార్య జ‌డా పింకెట్ స్మిత్ పై జోకులేయ‌డంతోనే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అనంత‌త‌రం విల్ స్మిత్ వేదిక‌పైనే క్రిస్ రాక్ కి...అకాడ‌మీకి క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు.

ముందు లాగిపెట్టి కొట్ట‌డం..ఆ త‌ర్వాత సారీ చెప్ప‌డం సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అయింది. దీనిపై నెటి జ‌నులు భిన్న ర‌కాలుగా స్పందించారు. కొంద‌రు క్రిస్ రాక్ ని స‌పోర్ట్ చేయ‌గా మ‌రి కొంద‌రు విల్ స్మిత్ కి మ‌ద్ద‌తుగా నిలిచారు.అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే ఆస్కార్ వేడుక‌ల్లో ఇలాంటి ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం ఆస్కార్ చ‌రిత్ర‌లోనే మొట్ట మొద‌టిల‌సారి.

తాజాగా ఈ ఘ‌ట‌న‌పై ఆస్కార్ క‌మిటీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుల‌కుంది. విల్ స్మిత్ ని 10 ఏళ్ల పాటు ఆస్కార్ వేడుక‌ల్లో పాల్గొన‌కుండా బ‌హిష్క‌రించింది. ఈ నిషేధం నేటి నుంచి అమ‌లులోకి వ‌స్తుంది. ఆ త‌ర్వాత విల్ స్మిత్ ని ఆహ్వానించాలా? వ‌ద్దా? అన్న‌ది అప్పుడు క‌మిటీ అప్పుడు నిర్ణ‌యం తీసుకుంటుంది.

స్మిత్ పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి అన్న దానిపై క‌మిటీ శుక్ర‌వారం స‌మావేశ‌మైంది. అకాడ‌మీ అధ్య‌క్షుడు డేవిడ్ రూబిన్..సీఈవో డానన్ హ‌డ్స‌న్.. బోర్డు స‌భ్యులుల స్టీవెన్ స్పీల్ బ‌ర్గ్.. హుపీ గోల్డ్ బ‌ర్గ్ త‌దిత‌రులు ఉన్నారు.

క‌మిటీ తుది నిర్ణ‌యం మేర‌కే స్మిత్ ని బ్యాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే విల్ స్మిత్ చెంప దెబ్బ అనంత‌రం రాక్కి..క‌మిటీకి క్ష‌మాప‌ణ‌లు కూడా తెలిపారు. కానీ అత‌ని క్ష‌మాప‌ణ‌ల్ని క‌మిటీ స్వీక‌రించలేద‌ని తెలుస్తోంది. ఈ విష‌యంపై క‌మిటీ విల్ స్మిత్ నే త‌ప్పు బ‌ట్టింది. విల్ స్మిత్ వెర్ష‌న్ ని ఏ మాత్రం క‌మిటీ కన్సిడ‌ర్ చేయ‌లేదు. ఈ విష‌యంలో పూర్తిగా క‌మిటీ క్రిస్ రాక్ వైపే మ‌ద్ద‌తుగా నిలిచింది.

అయితే ఈ నిషేధంపై విల్ స్మిత్ ఇంకా స్పందించ‌లేదు. మ‌రి క‌మిటీ నిషేధాన్ని ఆయ‌న స్వాగ‌తిస‌త్ఆరా? తిర‌స్క‌రిస్తారా? మౌనం వ‌హిస్తారా? అన్న‌ది తెలియాలంటే వెయిట్ చేయాలి. విల్ స్మిత్ పై నిషేధంతో ఆయ‌న అభిమానులు ఆస్కార్ క‌మిటీని త‌ప్పుబ‌డుతున్నారు. మ‌హిళా మ‌నోభావాల్ని కాపాడ‌టంతో క‌మిటీ విఫ‌ల‌మైందంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్లు పెడుతున్నారు.