Begin typing your search above and press return to search.
సోనియాకు చంద్రబాబు కటౌట్ గుర్తుకు వచ్చి ఉంటుందా?
By: Tupaki Desk | 12 Nov 2019 7:09 AM GMTమహారాష్ట్ర రాజకీయాలు ఎలా సాగుతున్నాయో చూస్తున్నదే. అయితే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మౌనం శివసేన చిరకాల వాంఛ తీరే ఛాన్స్ ఇవ్వలేదని చెప్పాలి. బీజేపీని దెబ్బ తీయటానికి వచ్చిన అవకాశాన్ని సోనియా ఎందుకు వదిలేశారు? ఏ కారణం ఆమెను ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండేలా చేసింది? అన్న విషయంలోకి వెళితే.. కొన్ని ఆసక్తికర అంశాలు కనిపించకమానవు.
మహారాష్ట్ర ఎపిసోడ్ లో సోనియా మౌనం వెనుక చంద్రబాబు కారణంగా చెబుతున్నారు. బాబుకు నేరుగా ఎలాంటి సంబంధం లేకున్నా.. ఆయనకు ఎదురైన అనుభవం జాతీయ స్థాయిలో తమకు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా ఆమె తాజా నిర్ణయం ఉండి ఉంటుందంటున్నారు.
గత ఏడాది ఇదే సమయానికి జోరుగా సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ తో కలవటం.. సైద్ధాంతిక విబేదాల్ని పక్కన పెట్టి.. పురిటితో వచ్చి శత్రుత్వాన్ని వదిలేసి కాంగ్రెస్ తో చెట్టాపట్టాలేసుకున్నదాని ఫలితం తెలంగాణలోనే కాదు.. ఆ తర్వాత ఏపీలోనూ ఓటర్లు ఎంతలా తిరస్కరించింది తెలిసిందే.
కేవలం రాజకీయ స్వార్థమే తప్పించి మరింకేమీ తనకు ముఖ్యం కాదన్న రీతిలో వ్యవహరించిన చంద్రబాబును ప్రజలు ఛీకొట్టారు. ఇలాంటి పరిస్థితే తాము కానీ శివసేనతో చేతులు కలిపితే అన్న ఆలోచనే సోనియాను ముందుకు వెళ్లకుండా నిరోధించి ఉంటాయని చెబుతున్నారు.
టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా తమ దారిన తాము పోటీ చేసి ఉంటే.. తెలంగాణలో తమకు ఎక్కువ స్థానాలు వచ్చి ఉండేవన్న మాట తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పటాన్ని మర్చిపోలేం. అదే సమయంలో కాంగ్రెస్ తో దోస్తానాపై ఏపీ ప్రజలు మండిపాటుతో పాటు.. అసలు ఎలా కలుస్తారంటూ బాబు పార్టీని ఛీదరించుకున్న కారణంగానే ఆ పార్టీకి దారుణమైన ఫలితాలు ఎదురయ్యాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చుకున్న సోనియా.. మహారాష్ట్ర ఎపిసోడ్ విషయంలో ఆచితూచి వ్యవహరించి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.