Begin typing your search above and press return to search.
ఏపీపై బీజేపీ మరో కుట్ర !
By: Tupaki Desk | 6 May 2018 6:46 AM GMTమనకు రావాల్సిన నీటిని అక్రమ ప్రాజెక్టులతో అడ్డుకుంటుంటే మారుమాట్లాడలేదు కేంద్రం. చివరకు కోర్టుల పుణ్యమా అని ఏడాదికి నాలుగు నెలలు మాత్రం బాబ్లీ ప్రాజెక్టు నుంచి గోదావరి దిగువకు నీళ్లొస్తాయి. మిగతా సమయంలో గోదావరి నది అసలు తెలంగాణలో అడుగు పెట్టకుండా అడ్డుకుంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం. దీనిని కళ్లారా చూస్తున్న కేవలం పార్టీ సంక్షేమం కోసం పరమ స్వార్థంతో బీజేపీ చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది. అదేంటో తెలుగు రాష్ట్రాలకు సాయం చేయడానికి కేంద్రంలో ఏ సర్కారుకు మనసురాదు.
గోదావరి నీటి లభ్యత ఈ మధ్యన బాగా పడిపోయింది. ఈ నేపథ్యంలో గంగా - బ్రహ్మపుత్ర నదులను ఇతర నదులకు అనుసంధానం చేస్తే దేశం సస్యశ్యామలం అవుతుంది. కానీ ఆ పని చేయకుండా గోదావరిలో ఉన్న కాసిన్ని నీళ్లను అందరికీ పంచుతారట. ఆ నది ప్రవహించే మహారాష్ట్ర-తెలంగాణ-ఆంధ్రలకే సరిగా నీళ్లు దొరక్క చస్తుంటే... బీజేపీ వాటిని కర్ణాటక - తమిళనాడుకు కూడా తీసుకెళ్తానంటోంది. దీనికోసం ఏకంగా కేంద్రం డబ్బులతోనే ప్రాజెక్టు కడతారంట.
ఒకవైపు పోలవరం ప్రాజెక్టు శరవేగంగా కట్టించి ఏపీ రాష్ట్రానికి మేలు చేస్తామని హామీ ఇచ్చి దానిని మడిచి గూట్లో పెట్టిన మోడీ సర్కారు అడగకుండానే ఇప్పటికే గోదావరి - కృష్ణా నీళ్లను మనకు రాకుండా దోచుకుంటున్న మహారాష్ట్ర-కర్ణాటకలకు పంచుతుందట. ఇంతకంటే మోసం ఏముంటుంది?
కర్ణాటక నుంచి నీటి విడుదలకు సుప్రీంకోర్టు అనుమతి ఇస్తూ తీర్పు ఇచ్చినా కర్ణాటక ప్రభుత్వం ధిక్కరిస్తుంటే ఏమీ చేయని మోడీ కర్ణాటక ప్రజల మనసుతో పాటు ఎన్నికలు గెలవడానికి, మహారాష్ట్రలో తమ బీజేపీని పటిష్టం చేసుకోవడానికి మిగతా రాష్ట్రాల గొంతు కోయడానికి రెడీ అయ్యింది. తమిళనాడుల నీటి కొరత తీర్చేందుకు గోదావరిపై రెండు భారీ ప్రాజెక్టులు నిర్మించనున్నట్లు కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీ నిన్న ప్రకటించారు. అందులో ఒకటి పోలవరమట. రెండింటినీ కేంద్రం నిధులతో కట్టిస్తామన్నారు. నాలుగేళ్ల నుంచి అడుగుతుంటే మారుమాట్లాడని బీజేపీ నేతలు ఇపుడు వచ్చి 50 వేల కోట్ల ఖర్చుపెట్టబోతున్నాం అని గొప్పలు చెబితే ఎలా నమ్మాలి.