Begin typing your search above and press return to search.
తెలంగాణలో టీడీపీ భూ స్థాపితమేనా?
By: Tupaki Desk | 17 Jun 2019 7:50 AM GMTతెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ అయినట్టే కనిపిస్తోంది. ఇక తెలంగాణలో సైకిల్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను చూసే చాన్స్ కూడా ఉండదంటున్నారు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో రెండు అసెంబ్లీ సీట్లను టీడీపీ గెలుచుకుంది. సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య-అశ్వరావుపేట నుంచి మచ్చె నాగేశ్వరరావు విజయం సాధించారు.
అయితే టీఆర్ ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పడిపోయారు. ఆయన కేసీఆర్ ను కలిసి టీఆర్ ఎస్ లో చేరిపోయారు. ఇక తాజాగా అశ్వరావుపేటలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ ఎస్, కాంగ్రెస్ లో చేరిపోయారు. దీంతో టీడీపీ కథ తెలంగాణలో ముగిసినట్టేనంటున్నారు..
అయితే అశ్వరావుపేట ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే టీడీపీ నేతలు పార్టీ మారినట్టు తెలుస్తోంది. తొందరలోనే అశ్వరావు పేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు కూడా టీఆర్ ఎస్ లో చేరబోతున్నట్టు తెలిసింది. దీంతో ఇక తెలంగాణలో టీడీపీ కనుమరుగవుతున్నట్టే లెక్క..
ఎంతో ఘన చరిత్ర కలిగిన టీడీపీని తెలంగాణలో తొలిసారి అధికారం చేపట్టగానే టార్గెట్ చేశారు కేసీఆర్. అప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను లాగేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ తో జట్టు కట్టి టీడీపీ పోటీచేసి రెండు స్థానాల్లో గెలిచింది. ఇప్పుడా ఇద్దరినీ లాగేసి కేసీఆర్ తెలంగాణలో టీడీపీని భూస్థాపితం చేయబోతున్నాడని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.