Begin typing your search above and press return to search.

పల్నాడులో టీడీపీ నిలబడుతుందా?

By:  Tupaki Desk   |   23 May 2021 11:30 PM GMT
పల్నాడులో టీడీపీ నిలబడుతుందా?
X
పల్నాడు పౌరుషానికి పెట్టింది పేరు. దివంగత కోడెల శివప్రసాద్ ఇక్కడ టీడీపీ తరుఫున దశాబ్ధాలపాటు రాజకీయం చేశాడు. ఆ పార్టీలోనే రాజకీయ జీవితం మొదలుపెట్టి.. అదే పార్టీ జెండా కప్పుకొని తనువు చాలించాడు. ఊహించని విధంగా రాజకీయ ఒత్తిడులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని మరణించారు. కోడెల మరణం తర్వాత నరసారావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ అడ్రస్ గల్లంతు అయినట్లు కనిపిస్తోంది.

నరసారావుపేటను కోడెల తన పెట్టని కోటగా మార్చాడు. ఐదు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. వరుసగా 1983,1985,1989,1994,1999 ఎన్నికల్లో విజయం సాధించారు. 2004,2009 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా బీజేపీకి నరసారావుపేట వదిలేసి సత్తెనపల్లిలో పోటీచేసి గెలిచారు. ఆరోసారి గెలిచి ఆంధ్రా స్పీకర్ అయ్యారు.

2019లో ఓడిపోయిన కోడెలపై వైసీపీ ప్రభుత్వం విచారణ జరపడం.. అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కోడెల మరణంతో సత్తెనపల్లిలో టీడీపీ బలహీనమైంది. నరసారావుపేటలో టీడీపీ తరుఫున చదలవాడ అరవింద్ బలంగా లేరు. సత్తెనపల్లి టీడీపీ బాధ్యతలు ప్రస్తుతం కోడెల తనయుడు శివరాం చూస్తున్నాడు.అయితే కోడెల మాదిరిగా పార్టీలో ఆయన యాక్టివ్ కాదు. కార్యకర్తలకు అందుబాటులో ఉండడనే టాక్ ఉంది. పార్టీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించి మిగతా సమయాల్లో పార్టీని పట్టించుకోడని పేరుంది.

ఇప్పుడు టీడీపీలో సత్తెనపల్లి సీటుపై కోడెల తనయుడుతోపాటు రాయపాటి వారసుడు కూడా కన్నేశారు. చంద్రబాబు మాత్రం తేల్చడం లేదు. పార్టీ కేడర్ ఈ ఇద్దరి మధ్య విడిపోయింది. పార్టీ కేడర్లో కొందరు కోడెల వారసుడికి, కొందరు రాయపాటి వారసుడికి సపోర్ట్ చేస్తున్నారు. దీంతో సత్తెనపల్లిలో టీడీపీ బలపడడం లేదు. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అటు నరసారావుపేటలో టీడీపీది అదే పరిస్థితి. మొత్తానికైతే కోడెల చనిపోయాక నరసారావుపేట, సత్తెనపల్లిలో టీడీపీ పెద్ద చిక్కున్నదే కరువైపోయింది.