Begin typing your search above and press return to search.

ప‌ద‌వి దిగిపోయారుగా... వీర్రాజు ఏం చేస్తారో!

By:  Tupaki Desk   |   26 May 2021 3:30 AM GMT
ప‌ద‌వి దిగిపోయారుగా... వీర్రాజు ఏం చేస్తారో!
X
ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా ఎద‌గాలని ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీ ఈ విష‌యంలో చేప‌ట్ట‌బోయే భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌తిప‌క్షంగా ఎద‌గాలంటే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల విష‌యంలో త‌క్ష‌ణ‌మే స్పందించాలి. వారికి అండ‌గా ఉండేందుకు త‌గు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాలి. అయితే, ఏపీ బీజేపీ ఈ విష‌యంలో అంత దూకుడుగా లేద‌నే భావ‌న విశ్లేష‌కులు వ్య‌క్తం చేస్తుంటారు. అయితే, తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు తీసుకోబోయే నిర్ణ‌యం మ‌ళ్లీ ఆ పార్టీ వార్త‌ల్లోకి ఎక్కేందుకు కార‌ణ‌మైంది.

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు శాసనమండలి సభ్యత్వ కాలం సోమవారంతో ముగిసింది. ఈ సంద‌ర్బంగా ఆయ‌న స్పందిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ ప్రతినిధిగా సభ లోపల, వెలుపల పోరాటాలు చేశాన‌ని పేర్కొన్నారు. గడిచిన ఆరేళ్లలో పలు అంశాలపై తన వాణి వినిపించానని పేర్కొంటూ సహకరించిన వారంద‌రికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇక పూర్తి స్థాయిలో ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా సోము వీర్రాజు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు స‌మ‌యం కేటాయించే అవ‌కాశం ఉంది. మ‌రి అలాంటి స‌మ‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రిపాల‌న‌ను టార్గెట్‌ చేయ‌డంలో ఆయ‌న ఎలాంటి స్టాండ్ తీసుకోనున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

పొరుగు రాష్ట్రమైన తెలంగాణ‌లో ప‌రిపాల‌న‌పై ఆ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ దూకుడుగా స్పందిస్తుంటారు. వివిధ కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం , పార్టీ శ్రేణుల‌ను భాగ‌స్వామ్యం చేయ‌డం , మిగ‌తా పార్టీల కంటే వేగంగా స్పందించ‌డంలో ఆయ‌న వైఖ‌రితో స‌మానంగా బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు దూకుడు ఉండ‌టం లేద‌న్న‌ది విశ్లేష‌కుల కామెంట్‌. ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా పూర్తి స్థాయి స‌మ‌యం కేటాయించే చాన్స్ ఉన్న నేప‌థ్యంలో వీర్రాజు ఏం చేస్తార‌నేది స‌హ‌జంగానే ఆస‌క్తిని రేకెత్తించే అంశం.