Begin typing your search above and press return to search.
గార్డెన్ సిటీలో కొత్త రూల్.. పార్కింగ్ ఉంటేనే కారు అమ్ముతారు?
By: Tupaki Desk | 2 Dec 2020 1:30 PM GMTమహానగరాల్ని తెగ ఇబ్బంది పెట్టేసే సమస్యల్లో పార్కింగ్ ఇష్యూ ఒకటి. నిజానికి కారు పార్కింగ్ ఉందా? లేదా? అన్న విషయాన్ని పట్టించుకోకుండా కార్లు కొనేసేటోళ్లు చాలామంది కనిపిస్తారు. పార్కింగ్ కు అవకాశం లేకపోవటంతో రోడ్ల మీదనే ఇష్టారాజ్యంగా కార్లను నిలిపి ఉంచే వారుకు కొదవ ఉండదు. రోజురోజుకు రోడ్ల మీదకు వస్తున్న కార్లతో ట్రాఫిక్ నరకప్రాయంగా మారుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కార్లు పెరిగిపోవటం వల్ల పార్కింగ్ ఇష్యూలు తలెత్తుతున్నాయి.
ఇలాంటి వేళ.. ఈ ఇష్యూకు చెక్ పెట్టేందుకు కర్ణాటక సర్కారు వినూత్న నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుందని చెబుతున్నారు. ఇకపై బెంగళేూరు మహానగరంలో కారు కొనుగోలు చేయాలంటే.. సదరు కొనుగోలుదారు తాను కొనే కారును పార్కింగ్ చేసుకోవటానికి తగిన ప్లేస్ ఉందా? లేదా? అన్న విషయంపై సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే కారు కొనుగోలు చేయటానికి అనుమతించేలా నిర్ణయం తీసుకోనున్నారు. తనకు కారును పెట్టేందుకు అవసరమైన సొంత స్థలం ఉందని చెప్పాల్సి ఉంటుంది.
ఈ విధానాన్ని అమలు చేస్తే.. పార్కింగ్ సమస్యను కొంతమేర అధిగమించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. కర్ణాటక రాష్ట్రం అమల్లోకి తేవాలని భావిస్తున్న ఈ కొత్త విధానాన్ని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోనూ అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నగరంలో పెరుగుతున్న వాహనాలకు చెక్ పెట్టటంతో పాటు.. సొంత స్థలం ఉన్న వారు మాత్రమే కార్లు కొనుగోలు చేసేలా కట్టడి చేయటం వల్ల హైదరాబాద్ లో ఇష్టారాజ్యంగా రోడ్ల మీదనే కార్లు నిలిపే ధోరణి తగ్గుముఖం పడే అవకాశం ఉంది. మరి.. కర్ణాటకను స్ఫూర్తిగా తీసుకొని సీఎం కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.